NTV Telugu Site icon

SSMB 28: బాబు బ్యాండ్ కడితే బాక్సాఫీస్ కి బొమ్మ కనిపించడం గ్యారెంటి

Ssmb 28

Ssmb 28

సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ అవతారంలో చూపించబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ మూవీ సెట్స్ నుంచి మహేశ్ బాబు-త్రివిక్రమ్- ప్రొడ్యూసర్ నాగ వంశీ ఉన్న ఫోటో ఒకటి లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మహేశ్ బాబు తలకి కర్చీఫ్ కట్టుకోని కనిపించాడు. మహేశ్ మాస్ లుక్ లో ఉన్నాడు అంటూ ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో లీక్ అయిన ఫోటోని ట్రెండ్ చేస్తున్నారు. #SSMB28 అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి మహేశ్ ఫాన్స్ ట్వీట్స్ వేస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ గుంటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Read Also: SSMB 28: జనవరి 18న షూటింగ్, ఆగస్ట్ 11న రిలీజ్… శ్రీలీల మెయిన్ హీరోయిన్

ఇదిలా ఉంటే మహేశ్ బాబు హెడ్ బ్యాండ్ కట్టిన ప్రతిసారీ బాక్సాఫీస్ కి బొమ్మ చూపిస్తూ ఉంటాడు. రీజనల్ సినిమాలతో కూడా కలెక్షన్స్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే మహేశ్ బాబు మొదటిసారి ‘పోకిరి’ మూవీలో హెడ్ బ్యాండ్ కట్టాడు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పటివరకూ టాలీవుడ్ లో ఉన్న ప్రతి బాక్సాఫీస్ రికార్డుని బ్రేక్ చేసింది. ఆ తర్వాత కొరటాల శివ డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు సినిమాలో కూడా మహేశ్ హెడ్ కి బ్యాండ్ కట్టాడు. ఈ మూవీ ఏకంగా నాన్-బాహుబలి రికార్డులని క్రియేట్ చేసింది. ఈ సెంటిమెంట్ ని బేస్ చేసుకోని #SSMB28 సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఘట్టమనేని అభిమానులు చెప్తున్నారు. అతడు, ఖలేజ సినిమాలతో మహేశ్-త్రివిక్రమ్ లు హిట్ కొట్టలేక పోయారు కానీ ఈసారి మాత్రం పాన్ ఇండియా రేంజులో హిట్ కొట్టడం గ్యారెంటి అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. మరి ఆ నమ్మకాన్ని త్రివిక్రమ్, మహేశ్ బాబు నిజం చేస్తారో లేదో తెలియాలి అంటే ఏప్రిల్ 28 వరకూ ఆగాల్సిందే.

Show comments