NTV Telugu Site icon

Mahesh Babu: అప్పుడు మహేశ్ బాబుకి హిట్ కావాలి, ఇప్పుడు మహేశ్ అంటేనే హిట్…

Mahesh Babu

Mahesh Babu

సోషల్ మీడియాలో #22Yearsof Murari ట్యాగ్ ని క్రియేట్ చేసి ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన మురారి సినిమా మహేశ్ బాబుకే కాదు, టాలీవుడ్ కే ఒక బెస్ట్ ఫ్యామిలీ డ్రామాని ఇచ్చింది. 2001లో రిలీజ్ అయిన మురారి సినిమా మహేశ్ బాబుని స్టార్ హీరోని చేసింది. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్, చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచి స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా మారిన మహేశ్ మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించాడు. ఆ తర్వాత మహేశ్ రెండు సినిమాలు నటించాడు కానీ ఆ రెండూ ఘట్టమనేని అభిమానులని నిరాశ పరిచాయి. ఇదేంటి హిట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్న కృష్ణ కొడుకు ఇలా కెరీర్ స్టార్టింగ్ లోనే ఫ్లాప్స్ ఇస్తున్నాడు. సరైన సినిమాలు ఎంచుకోవడం రాదా, తండ్రి తగ్గ కొడుకు దొరికాడు అనుకుంటే ఇలా కెరీర్ ని కష్టాల్లో పడేసుకున్నాడే అనే కామెంట్స్ వినిపించాయి.

ఈ కామెంట్స్ ని బ్రేక్ చేసిన సినిమా మురారి. ఆ సమయంలో మహేశ్ బాబు కెరీర్ ఉన్న ఫేజ్ కి మురారి సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. ఇప్పుడు మహేశ్ సినిమా అంటే హిట్ అనే నమ్మకం. యావరేజ్ స్టొరీలతో కూడా, నాన్-స్టార్ డైరెక్టర్స్ తో కూడా హిట్ స్ట్రీక్ ని కంటిన్యు చేస్తూ మహేశ్ బాబు బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. గత 22 ఏళ్ళలో మహేశ్ బాబు క్రియేట్ చేసుకున్న మార్కెట్, గ్రో అయిన విధానం, క్రియేట్ చేసిన రికార్డ్స్ అతన్ని సూపర్ స్టార్ ని చేశాయి, కృష్ణని మించిన కొడుకుని చేశాయి. పాన్ ఇండియా సినిమా రికార్డులని రీజనల్ సినిమాలతో బ్రేక్ చెయ్యగల స్థాయికి చేరిన మహేశ్ బాబు, ఇప్పుడు బాహుబలి డైరెక్టర్ తోనే సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ బయటకి వస్తే మహేశ్ బాబు పాన్ ఇండియా కాదు గ్లోబల్ స్టార్ అవుతాడు. సింపుల్ గా చెప్పాలి అంటే మురారి నుంచి ఇప్పటి వరకూ… ఈ 22 ఏళ్ల ప్రయాణం మహేశ్ బాబుని బాక్సాఫీస్ కి భాయ్ ని చేసింది.

Show comments