NTV Telugu Site icon

Mahesh Babu: ఈయన అన్నం తింటున్నాడా లేక అందం తింటున్నాడా?

Mahesh Babu

Mahesh Babu

ప్రతి ఒక్కరికీ ఏజ్ పెరిగే కొద్దీ గ్లామర్ తగ్గుతూ ఉంటుంది, సూపర్ స్టార్ మహేశ్ బాబుకి మాత్రం అందం పెరుగుతూ ఉంది. డీఫాల్ట్ గా డీఏజింగ్ టెక్నాలజీ పుట్టాడో ఏమో కానీ ఇప్పటికీ మహేశ్ బాబు పాతికేళ్ల దగ్గరే ఆగిపోయాడు. ఈ మాటని మరోసారి నిరూపిస్తూ సోషల్ మీడియాలో ఈరోజు రెండు ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. SSMB 28 సెట్స్ నుంచి బయటకి వచ్చిన రెండు ఫోటోస్ లో మహేశ్ బాబు మస్త్ ఉన్నాడు. ఒక ఫోటోలో మహేశ్ బాబుతో పాటు యాక్టర్ జైరామ్ ఉన్నాడు. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు చూస్తూ పెరిగాను, ఈరోజు ఆయన కొడుకుతో కలిసి నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ జైరామ్, మహేశ్ బాబుతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసిన జైరామ్ మంచి పేరు తెచ్చుకున్నాడు.

Read Also: Orange To Oscars: రామ్ చరణ్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్, ఒక బాడ్ న్యూస్…

అల వైకుంఠపురములో సినిమా సెంటిమెంట్ ని నమ్ముతూ త్రివిక్రమ్, జైరామ్ ని SSMB 28లోకి తీసుకోని వచ్చాడు. సెట్స్ లో జాయిన్ అయిన జైరామ్ మొదటి రోజు కావడంతో మహేశ్ బాబుతో, త్రివిక్రమ్ తో ఫోటోలు దిగాడు. త్రివిక్రమ్, మహేశ్ బాబు, జైరామ్ ఉన్న ఫోటో కూడా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. అన్నా అసలు నువ్వు అన్నం తింటున్నావా లేక అందం తింటున్నావా? అంటూ ఘట్టమనేని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మార్చ్ 22న ఉగాది పండగ సంధర్భంగా SSMB 28 నుంచి చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ బయటకి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ మోస్ట్ అవైటేడ్ సినిమాకి త్రివిక్రమ్ ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేశాడో చూడాలి.

Show comments