సూపర్ స్టార్ మహేష్ బాబు సోలో షోతో థియేటర్స్ కి ప్యాక్ చేస్తున్నాడు. గుంటూరు కారం సినిమాలో ఎన్ని మైనస్ లు ఉన్నా కూడా కేవలం తన ఎనర్జి అండ్ పెర్ఫార్మెన్స్ తో మహేష్ మ్యాజిక్ క్రియేట్ చేసాడు. మహేష్ బాబుని చూడడానికే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు. ఫెస్టివల్ సీజన్ ని మరింత ఎక్కువగా క్యాష్ చేసుకుంటూ గుంటూరు కారం సినిమా డే 4 సూపర్బ్ హోల్డ్ ని మైంటైన్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం సినిమా సంక్రాంతి పండగ రోజున ఈవెనింగ్ షోస్ కంప్లీట్ గా ఫుల్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి కదిలిరావడంతో కలెక్షన్స్ సాలిడ్ గా ఉన్నాయి. ఒక ఫ్లాప్ సినిమాకి ఇంత రిసీవింగ్ ఉండడం మహేష్ బాబుకి మాత్రమే చెల్లింది.
ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబుకి ఉన్న ఫాలోయింగ్ గుంటూరు కారం సినిమాకి చాలా హెల్ప్ అవుతోంది. సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట దారిలో నడుస్తూ గుంటూరు కారం సినిమా కూడా కంప్లీట్ గా మహేష్ బాబు చరిష్మాపైనే డిపెండ్ అయ్యింది. సింపుల్ గా చెప్పాలి అంటే ఈరోజు గుంటూరు కారం సినిమా కలెక్ట్ చేస్తున్న ప్రతి రూపాయి మహేష్ బాబు మేనియా రాబడుతున్నదే. నైజాంలో 4 డేస్ లో గుంటూరు కారం సినిమా 35 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది అంటే మహేష్ బాబు ఇమేజ్ ఆడియన్స్ ని థియేటర్స్ కి ఎంతగా పుల్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. నైజాం ఏరియాలో మహేష్ బాబుకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఇదే మరోసారి ప్రూవ్ చేస్తుంది గుంటూరు కారం సినిమా. పండగ సెలవలు అయిపోవడానికి వచ్చాయి కాబట్టి నైజాంలో గుంటూరు కారం సినిమా 50 కోట్ల మార్క్ ని రీచ్ అవుతుందేమో చూడాలి.
