NTV Telugu Site icon

Mahesh Babu: బాబు బీడీని వదలట్లేదుగా…

Mahesh Babu

Mahesh Babu

గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధమయ్యింది. ఈ ట్రైలర్ కోసం మహేష్ అభిమానులు గత 24 గంటలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ ట్రైలర్ కౌంట్ డౌన్ గంటలకి పడిపోవడంతో ఘట్టమనేని అభిమానుల్లో ఎక్కడ లేనంత జోష్ మొదలయ్యింది. ఈ మహేష్ బాబుని చూడడానికి, ఇలాంటి మాస్ మహేష్ బాబుని చూడడానికి ఫ్యాన్స్ గత ఆరేడేళ్లుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుంటూరు కారం సినిమా రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ ని పర్ఫెక్ట్ కట్ చేసి బయటకి వదిలితే చాలు మహేష్ ఫ్యాన్స్ కే కాదు టాలీవుడ్ బాక్సాఫీస్ ని కూడా పూనకాలు రావడం గ్యారెంటీ. ట్రైలర్ ఈరోజు వస్తుంది అంటూ మేకర్స్ ఒక కొత్త పోస్టర్ లాంచ్ చేసారు. గుంటూరు కారం నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ ఒకెత్తు, ఈ పోస్టర్ ఒకెత్తు అనే చెప్పాలి. ఈ పోస్టర్ లో మహేష్ బాబు బీడీ తాగుతూ నెవర్ బిఫోర్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. కార్ డోర్ దగ్గర నిలబడి మహేష్ బీడీ తాగుతున్న ఈ పోస్టర్ ఈరోజు నుంచి కటౌట్స్ లో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఈ పోస్టర్ లో మహేశ్ బాబు వింటేజ్ మెమొరీస్ ని గుర్తు చేస్తూ స్మోకింగ్ స్టైల్ తో ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాడు. అతడు, పోకిరి, అతిథి, ఒక్కడు లాంటి సినిమాల్లో మహేశ్ బాబు స్మోక్ చేస్తూ కనిపించాడు. మహేష్ స్మోకింగ్ స్టైల్ ఫ్యాన్స్ కి సెపరేట్ కిక్ ఇస్తుంది. ఇన్ని రోజులు మిస్సైన ఆ కిక్ ని గుంటూరు కారం సినిమా ఇస్తోంది. టిల్ డేట్ రిలీజ్ డేట్ చేసిన అన్ని ప్రమోషల్ కంటెంట్ లో బీడీ ఉంది కాబట్టి సినిమాకి ఆల్మోస్ట్ 80% వరకూ “ధూమపానం ఆరోగ్యానికి హానికరం” అనే స్టేషనరీ వార్నింగ్ కనిపించనుంది. ఎన్ని వార్నింగ్ బోర్డ్స్ కనిపిస్తే ఏంటి మహేష్ బీడీతో కనిపిస్తే చాలు… ఆ సీన్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. సింపుల్ గా చెప్పాలి అంటే సెన్సార్ వాళ్లు నో స్మోకింగ్ వార్నింగ్ సినిమా మొత్తం వేస్తారు, మహేష్ ఫ్యాన్స్ సినిమాతో అన్ని రికార్డులని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి జనవరి 12న గుంటూరు కారం ఘాటు తెలుగు రాష్ట్రాలకి ఏ రేంజులో తగులుతుందో చూడాలి.

Show comments