NTV Telugu Site icon

Guntur Kaaram: రీజనల్ కింగ్ కి సోలో రిలీజ్ పడితే రికార్డ్స్ లేస్తాయ్

Guntur Kaaram

Guntur Kaaram

2024 సంక్రాంతి సీజన్ లో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి హను మాన్, ఈగల్, నా సామీ రంగ, లాల్ సలామ్, అయలాన్, సైంధవ్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. తమ సినిమాకి డబ్బులు రావాలి, పండగ అంటే ఎక్కువ రోజులు సెలవలు వస్తాయి అని అలోచించి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడంలో తప్పులేదు కానీ ఈ రేసులో మహేష్‌ బాబు కూడా ఉన్నాడు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం సినిమాతో జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాపై గ్లిమ్ప్స్ తోనే అంచనాలు పెంచేసిన మేకర్స్, బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్స్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. షూటింగ్ ఫైనల్ స్టేజస్ లో ఉన్న గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలకి థియేటర్స్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

సింపుల్ గా చెప్పాలి అంటే సంక్రాంతి సినిమాలన్నీ కలిసి పోటీ పడేది కేవలం మహేష్ బాబుతోనే… నెల రోజుల క్రితం వరకూ గుంటూరు కారం సినిమా రిలీజ్ అవ్వదులే అనే డౌట్ ఉండడంతో రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు మిగిలిన సినిమాల నిర్మాతలు. మహేష్ రావడం పక్కా అంటే థియేటర్స్ విషయంలో ఇబ్బందులు రావడం గ్యారెంటీ. ఇటీవలే ప్రొడ్యూసర్స్ అంతా కలిసి కూర్చోని రిలీజ్ డేట్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్లు టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే గుంటూరు కారం సినిమాకి సోలో రిలీజ్ దక్కేలా ఉంది. జనవరి 12న గుంటూరు కారం సోలో రిలీజ్ కి లైన్ క్లియర్ అయినట్లు ఉంది. ఇదే రోజు రిలీజ్ కానున్న హనుమాన్ మూవీ జనవరి 12 నుంచి ఒక రోజు ముందుకి జనవరి 11న రిలీజ్ అయ్యేలా ఉంది. ఈ విషయంలో అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కానీ దాదాపు గుంటూరు కారం సినిమాకి జనవరి 12న సోలో రిలీజ్ దక్కడం గ్యారెంటీ. ఇదే జరిగితే సంక్రాంతి పండగని మహేష్ బాబు రెండు రోజుల ముందే మొదలుపెట్టడం పక్కాగా… సోలో రిలీజ్ తో పాటు గుంటూరు కారం సినిమాకి హిట్ టాక్ పడిందో మహేష్ బాబు వన్ సైడ్ చేసేస్తాడు.

Show comments