Site icon NTV Telugu

Mahesh Babu: ‘గుంటూరు కారం’ హైప్ షురూ!

Mahesh Babu

Mahesh Babu

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ అప్డేట్స్ మాత్రం ఆ రేంజ్‌లో రావడం లేదు. సినిమా రిలీజ్‌కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి.. ప్రమోషన్స్‌కు కూడా కాస్త టైం తీసుకొనున్నారు మేకర్స్. కానీ దసరాకు మాత్రం ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కారు వెనక డిక్కీ ఓపెన్ చేసి… దాని మీద మహేష్ కూర్చుని స్టైల్‌గా బీడీ వెలిగించే స్టిల్ మహేష్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తోంది. అలాగే త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని రాసుకొచ్చారు. అయితే… ఇప్పుడు గుంటూరు కారం బిజినెస్ లెక్కలు స్టార్ట్ అయ్యాయి. తాజాగా యూఎస్ డిస్టిబ్యూటర్స్ చేసిన పోస్ట్ సినిమా పై మరింత హైప్ పెరిగేలా చేసింది.

యూఎస్ డిస్టిబ్యూటర్స్ ప్రత్యంగిరా సినిమాస్… యూఎస్‌లో గుంటూరు కారం సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ రిలీజ్ ఓవర్సీస్ లో మహేష్ కెరీర్ లోనే నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట. ఓవర్సీస్ మార్కెట్ లో మహేష్ మేనియా మాములుగా ఉండదు, అలాంటి హీరోకి మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా కలిస్తే…గుంటూరు కారం యూఎస్ లెక్కలు ఏ రేంజులో ఉంటాయో ఊహించొచ్చు. భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి.. ఖచ్చితంగా యూఎస్‌లో గుంటూరు కారం సాలిడ్ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. అలాగే సలార్, ఓజి సినిమాలకు కూడా అమెరికాలో భారీ డిమాండ్ ఉంది. ఈ సినిమాల యూఎస్ రైట్స్ కూడా గుంటూరు కారం డిస్ట్రిబ్యూటర్స్ వాళ్లే తీసుకున్నారు. సలార్ డిసెంబర్ 22న వస్తుండగా… జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. అమెరికాలో మాత్రం ఓ రోజు ముందే… అంటే జనవరి 11న గుంటూరు కారం ప్రీమియర్స్ స్టార్ట్ అవనున్నాయి. మరి ఈసారి మహేష్ బాబు యూఎస్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Exit mobile version