Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల పరంగా ఎంత ఎదిగాడో.. సమాజ సేవ ద్వారా అంతే గుర్తింపు పొందాడు. ఇప్పటికే వేల మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్ చేయిస్తూ వారికి కొత్త లైఫ్ ను అందిస్తున్నాడు. అయితే తాజాగా మరో గొప్ప పని చేశాడు సూపర్ స్టార్. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే మహేశ్ తరఫున సేవాకార్యక్రమాలను నమ్రత నిర్వహిస్తోంది. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు, పాలు, గర్భాశయ కాన్సర్ టీకా కోసం ముందడుగు వేశారు.
Read Also : Court Movie: అక్కడ కోర్ట్ సినిమా స్క్రీనింగ్ నిలిపివేత.. ఎందుకంటే?
విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను మహేశ్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీన్ని నమ్రత స్వయంగా ఓపెన్ చేశారు. బాలికల కోసం ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకా డ్రైవ్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఈ ఏడాదిలోగా తెలుగు రాష్ట్రాల్లోని 1500 మంది బాలికలకు టీకాలు వేయడమే తమ లక్ష్యం అంటూ ఆమె వివరించారు. ఈ రోజుల్లో చాలా మంది చిన్నారులకు తల్లిపాలు సరిపోవట్లేదని, తల్లి లేని చిన్నారులకు కూడా ఈ మదర్ మిల్క్ బ్యాంక్ ద్వారా పాలు అందిస్తామని నిర్వాహకులు తెలిఆపరు. ప్రతి ఏడాది 7,200 మంది చిన్నారులకు పాలు అందిస్తామన్నారు.