Site icon NTV Telugu

ఇండియా మొత్తం ప్లిఫ్‌ అవుతుందంటున్న మహేష్!?

టాలీవుడ్ లో యాడ్స్ రంగంలో మహేశ్ బాబుకు ఎదురు లేదనే చెప్పవచ్చు. మహేశ్ చేసిన, చేస్తున్నన్ని ప్రకటనలు మరే హీరో చేయటం లేదు. టాప్ బ్రాండ్స్ అన్నీ ప్రచారం కోసం మహేశ్ ముంగిట్లోనే వాలుతున్నాయి. ఇటీవల పాన్ బాహర్ యాడ్ లో తళుక్కుమన్న మహేశ్ ఫ్లిఫ్‌ కార్డ్ వారి లేటెస్ట్ యాడ్ లో మెరిశాడు. ప్రముఖ ఇ-కామర్స్ బ్రాండ్ ఫ్లిప్‌కార్ట్ గతంలో మహేశ్ తో ప్రకటన చేసినప్పటికీ తాజాగా మరో యాడ్ రూపొందించింది. అది ఆన్ లైన్ లో విడుదలైంది. ఇందులో సీనియర్ నటి తులసితో కలసి నటించాడు మహేశ్.

ఫ్లిప్‌కార్ట్ ఈ వాణిజ్య ప్రకటనను ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ పేరుతో విడుదల చేసింది. ఇందులో ‘నేనే కాదు ఇండియా మొతం ఫ్లిప్ అవుతుందీ’ అంటూ మహేష్ ప్రమోట్ చేసాడు. ప్లిఫ్ కార్డ్ సైతం ‘మహేష్ బాబు మాత్రమే కాదు, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ #బిగ్ బిలియన్ డేస్‌లో కూడా ఇండియా ఫ్లిప్ చేస్తుంది’ అనేసింది. దక్షిణాదిన కస్టమర్స్ ని ఆకర్షించడానికి ఫ్లిప్‌కార్ట్ మహేష్‌ను వాడుకుంటోంది. ఇక ఉత్తారాదిన అమితాబ్ బచ్చన్, అలియా భట్, విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌. ఈ సినిమా జనవరి 13, 2022 న విడుదల కానుంది.

https://youtu.be/OuH2ry284Og
Exit mobile version