Site icon NTV Telugu

13 Years of Khaleja: దైవం మానుష్య రూపేణా… లైఫ్ టైమ్ సెటిల్మెంట్ క్యరెక్టర్ ఇది

Khaleja

Khaleja

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో కొన్ని ఐకానిక్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటివరకూ 27 సినిమాలని రిలీజ్ చేసి 28వ గుంటూరు కారం మూవీని ఆడియన్స్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి మహేష్ రెడీ అవుతున్నాడు. ఈ 27 సినిమాల్లో మహేష్ చేసిన మాస్ సినిమాలు చాలా తక్కువ… చేసింది తక్కువే అయినా మాస్ ని సెటిల్డ్ గా చూపించడంలో మహేష్ దిట్ట. టక్కరి దొంగ, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్ సినిమాలు చూస్తే తెలుస్తుంది అసలు మహేశ్ బాబు మాస్ అంటే ఏంటో. ఈ సినిమాలన్నీ ఒక రకం అయితే ఖలేజా సినిమా ఇంకో రకం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబుని “దైవం మనుష్య రూపేణా” అంటూ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసాడు.

ఒక ట్యాక్సీ డ్రైవర్… ఒక ప్రజల కోసం చేసిన సాయం ఖలేజా సినిమా కథ అయ్యింది. ఈ మూవీలో మహేష్ బాబు కామెడీ టైమింగ్, ఇంటెన్స్ డైలాగ్ డెలివరీ, టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్, మహేష్ ని ఎలివేట్ చేస్తూ త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ పూర్తిగా ఫ్యాన్ స్టఫ్ అంతే. సింపుల్ గా చెప్పాలి అంటే అల్లూరి సీతారామరాజు లాంటి క్యారెక్టర్ మహేష్ కి ఇంకొకటి పడలేదు, త్రివిక్రమ్ ఇలాంటి ఇంకో క్యారెక్టర్ నీ రాయలేదు. ఈ మూవీ రిలీజ్ అయ్యి నేటికీ 13 ఏళ్లు అయిన సందర్భంగా ఘట్టమనేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

మనిషిలోని దేవుడు ఉంటాడు అనే విషయాన్ని త్రివిక్రమ్ చెప్పడంలో తడబడ్డాడో లేక మన వాళ్లే అర్ధం చేసుకోవడంలో గాడి తప్పారో తెలియదు కానీ ఖలేజా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న సినిమా థియేటర్స్ లో ఆడలేదు. ఖలేజా అనే కాదు అతడు సినిమా కూడా ఇంతే… కల్ట్ స్టేటస్ సొంతం చేసుకున్న ఈ రెండు సినిమాలు ఆడియన్స్ ని మెప్పించాయి కానీ ప్రొడ్యూసర్ కి డబ్బులు తీసుకోని రాలేదు. ఆ లోటుని తీర్చడానికి మహేష్ అండ్ త్రివిక్రమ్ కలిసి గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నారు. జనవరి 12న గుంటూరు కారం సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి… హిట్ లోటుని తీర్చేస్తారేమో చూడాలి.

Exit mobile version