Site icon NTV Telugu

Mahesh Babu: సూర్య భాయ్ దెబ్బకి పవన్, ఎన్టీఆర్ ల రికార్డ్స్ బ్రేక్ అవుతాయా?

Businessman

Businessman

సూపర్ స్టార్ మహేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో సెకండ్ సినిమాగా రిలీజ్ అయ్యింది ‘బిజినెస్ మాన్’. హీరోయిజంకి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే ఈ సినిమాలో మహేష్ బాబు ‘సూర్య భాయ్’ క్యారెక్టర్ లో ట్రెమండస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డైలాగ్స్, సాంగ్స్, సీన్స్, ఫైట్స్ లాంటి ఎలిమెంట్స్ అన్నీ బిజినెస్ మాన్ సినిమాలో టాప్ నాచ్ లో ఉంటాయి. టాలీవుడ్ చూసిన ఐకానిక్ క్యారెక్టర్స్ లో సూర్య భాయ్ పాత్ర కూడా ఒకటి. అందుకే మహేష్ బాబు పుట్టిన రోజైన ఆగస్టు 9న బిజినెస్ మాన్ సినిమాని గ్రాండ్ గా రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మొదలైన ప్రీబుకింగ్స్ జోష్ చూస్తుంటే సూర్య భాయ్ అనే క్యారెక్టర్ మహేష్ ఫాన్స్ కి మాత్రమే కాదు ప్రతి సినీ అభిమానికి ఇష్టమైనదనే విషయం అర్ధమవుతుంది. అందుకే బుకింగ్స్ లో జోష్ ఆ రేంజ్ లో ఉంది.

సుదర్శన్ 35MM థియేటర్ లో బిజినెస్ మాన్ రీరిలీజ్ మార్నింగ్ షో టికెట్స్ కేవలం 21 నిమిషాల్లో అయిపొయింది అంటే బిజినెస్ మాన్ సినిమాకి ఆడియన్స్ లో ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. నీ గోల్ 10 మైల్స్ అయితే ఐమ్ ఫర్ ది లెవెన్త్ మైల్ అని చెప్పే సూర్య భాయ్ ముందు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రెండు భారీ టార్గెట్స్ ఉన్నాయి. రీరిలీజ్ ట్రెండ్ లో డే అన్ని సెంటర్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది సింహాద్రి సినిమా. రీరిలీజ్ ఫుల్ రన్ లో ఖుషి సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నైజాంలో ఖుషి సినిమా సూపర్బ్ కలెక్షన్స్ ని రాబట్టింది. నైజాంలో మహేశ్ బాబుకి మంచి పట్టుంది. మరి డే 1 సింహాద్రి రికార్డ్స్ ని, ఫుల్ రన్ లో ఖుషి రికార్డ్స్ ని బ్రేక్ చేసి బిజినెస్ మాన్ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

Exit mobile version