NTV Telugu Site icon

Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సూర్య భాయ్ మళ్లీ వస్తున్నాడు

Mahesh

Mahesh

Mahesh Babu: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పాత సినిమాలను 4k సౌండ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ రీ రిలీజ్ సినిమాలకు కూడా ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన సింహాద్రి సినిమాకు అభిమానులు ఎంత హంగామా చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ రీ రిలీజ్ లిస్ట్ లోకి ఇండస్ట్రీని షేక్ చేసిన మరో సినిమా రాబోతుంది. అదే బిజినెస్ మ్యాన్. సూపర్ స్టార్ మహేష్ బాబు- డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా 2012లో లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు ఊర మాస్ స్వాగ్.. పూరి అల్టిమేట్ డైలాగ్స్ తో సినిమా అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది.

Trivikram: సందు దొరికినప్పుడల్లా.. ఆ కోరిక తీర్చుకుంటున్న గురూజీ..?

సూర్యభాయ్ అనే మాఫియా డాన్ గా మహెష్ కనిపించాడు. ఈ సినిమా అంటే మహేష్ ఫ్యాన్స్ కు ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ డైలాగ్స్, కాజల్ అందం, తమన్ మ్యూజిక్ మొత్తం కలిపి ఇదొక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి పదేళ్లు పూర్తీ కానున్న సందర్భంగా ఈ చిత్రాన్ని మహేష్ పుట్టినరోజున.. అనగా ఆగస్ట్ 9 న రీ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలియడంతో మహేష్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. సూర్య భాయ్ మళ్లీ వస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మహేష్ ఒక్కడు సినిమా రీ రిలీజ్ కే ఫ్యాన్స్ ఎంతటి హంగామా చేశారో తెల్సిందే.. మరి ఈ సినిమాకు థియేటర్లు ఉంటాయా..? పోతాయా అనేది చూడాలి.

Show comments