నిన్న విడుదలైన టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ పై సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్విట్టర్ వేదికగా ట్రైలర్ పై ఆసక్తికరంగా స్పందించారు. “ట్రైలర్ లోని ప్రతి షాట్ అద్భుతంగా ఉంది. మైండ్ బ్లోయింగ్!! మాస్టర్ స్టోరీ టెల్లర్ తిరిగి వచ్చాడు. ట్రైలర్ అంతా గూస్‌బంప్స్!!” అంటూ ట్వీట్ చేశారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
Read Also : కష్టాల్లో కపిల్ దేవ్ బయోపిక్ … కేసు నమోదు
ఇక కేవలం మహేష్ మాత్రమే కాకుండా టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలంతా “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, విజయ్ దేవరకొండ, పూజ హెగ్డే, రష్మిక మందన్న, సమంత, రానా, వరుణ్ తేజ్ కొణిదెల, రాశి ఖన్నా, వెన్నెల కిషోర్, అడవి శేష్, కరణ్ జోహార్ తదితరులు ట్రైలర్ పై మైండ్ బ్లోయింగ్ రియాక్షన్ ఇచ్చారు.
