NTV Telugu Site icon

Mahesh Babu: టాలీవుడ్ లో మరో పెద్ద మల్టీస్టారర్.. నాగార్జునతో మహేష్ బాబు

Nag

Nag

Mahesh Babu: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్స్ నడుస్తున్న విషయం విదితమే. ఇప్పటివరకు అతిపెద్ద మల్టీస్టారర్ ఏది అంటే ఆర్ఆర్ఆర్ అనే చెప్పాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లను కలిపినా ఘనత దర్శక ధీరుడు రాజమౌళిది. ఆయన ఇన్స్పిరేషన్ తో ఎన్నో మల్టీస్టారర్లు రాబోతున్నాయి. ఇక త్వరలో అక్కినేని, ఘట్టమనేని కాంబోలో ఒక సినిమా రాబోతోందా..? అంటే అవుననే మాట వినిపిస్తోంది. అక్కినేని నాగార్జునకు మరో స్టార్ హీరోతో చేయడం మొదటి నుంచి అలవాటే. ఇక సూపర్ స్టార్ మహేష్ సైతం వెంకీ మామతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ కాంబో పట్టాలెక్కబోతుంది. ఏంటి.. నిజమా.. అంటే అక్కినేని నాగార్జున స్వయంగా మహేష్ ను ఒక సినిమా చేద్దామా అని అడగడం.. అందుకు మహేష్ సైతం తప్పకుండా అనడంతో టాలీవుడ్లో మరో పెద్ద మల్టీస్టారర్ కు సమయం కుదిరింది అనిపిస్తోంది అని అంటున్నారు అభిమానులు.

కొద్దిసేపటి క్రితం నాగ్ నటించిన ది ఘోస్ట్ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు సోషల్ మీడియా లో రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ రిలీజ్ చేసినందుకు నాగ్, మహేష్ కు థాంక్స్ చెప్తూ ” హే మహేష్.. నేను చాలా సంతోషంగా ఉన్నాను29 ఏళ్ళ క్రితం మీ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణతో వారసుడు చిత్రంలో నటించినందుకు. ఇప్పుడు ఆ సర్కిల్ ను మనమెందుకు పూర్తి చేయకూడదు. ది ఘోస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేసినందుకు థాంక్స్” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ కు మహేష్ స్పందిస్తూ “తప్పకుండా.. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా దీని కోసం ఎదురుచూడవచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోలు మల్టీస్టారర్ కు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు మరో కొత్త కాంబో సెట్ అయిపోయినట్లే అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.