Site icon NTV Telugu

Mahesh Babu: మీకోసం ఆరోజే తలుపులు తెరుస్తున్నాం.. మహేష్ బాబు కీలక ప్రకటన

Amb Bangalore

Amb Bangalore

బెంగళూరు సినీ ప్రియులకు మహేష్ బాబు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న AMB సినిమాస్ ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా ఉన్న ‘AMB సినిమాస్’ ఇప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరులో అడుగుపెడుతోంది, జనవరి 16వ తేదీన ఈ గ్రాండ్ మల్టీప్లెక్స్ ప్రేక్షకుల కోసం తలుపులు తీయనుంది. ఇది కేవలం ఒక మల్టీప్లెక్స్ మాత్రమే కాదు, ఇదొక అద్భుతమైన సాంకేతిక విప్లవం, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ‘డాల్బీ సినిమా’ ఎక్స్‌పీరియన్స్‌ను AMB టీమ్ ఇక్కడ పరిచయం చేస్తోంది.

Also Read : Sharwanand: ఎట్టకేలకు హిట్ కొట్టిన శర్వానంద్!

అత్యుత్తమ స్క్రీనింగ్ క్వాలిటీ, చెవులకు విందు చేసే సౌండ్ సిస్టమ్‌తో సినిమా చూడాలనుకునే వారికి ఇది ఒక కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోంది, ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తన టీమ్‌ను మహేష్ బాబు అభినందించారు. “టీమ్ AMB పడ్డ అసాధారణమైన కష్టాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది, నమ్మ బెంగళూరులో మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను” అంటూ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఐకానిక్ సినిమా హాల్‌గా పేరుగాంచిన AMB, ఇప్పుడు బెంగళూరులోనూ అదే మేజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమైంది.

Exit mobile version