NTV Telugu Site icon

Maharaja: మహారాజ హిందీ రీమేక్ ఫిక్స్.. హీరో ఎవరంటే..?

Untitled Design (4)

Untitled Design (4)

విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన చిత్రం ‘ మహారాజా ‘. మక్కల్ సెల్వన్ కెరీర్ లో 50వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తో 50రోజులు పూర్తిచేసుకుంది. ఇటీవల ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ నెట్ ఫ్లిక్స్ మహారాజాను స్ట్రీమింగ్ కు ఉంచగా వారం రోజుల పాటు ఇండియా నం1 గా ట్రెండ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది విజయ్ సేతుపతి మహారాజ. కేవలం రూ.20 కోట్లతో రూపొందించిన మహారాజ తమిళనాడు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సేతుపతి కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా మహారాజా నిలిచింది. తెలుగులోను ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

కాగా ‘మహారాజా’  సింపుల్ కథను అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఎమోషనల్ డ్రామా పండిస్తూ ట్విస్ట్‌లు మరియు టర్న్‌లతో ఆడియెన్స్ ఎంగేజ్ చేసే విధంగా దర్శకుడు నిథిలన్‌ స్వామినాథన్‌ మలిచిన తీరు సూపర్ అనే చెప్పాలి. ఇప్పుడు మహారాజ బాలీవుడ్ వెళ్లనున్నాడని సమాచారం. విభిన్న కథలను ఎంచుకొని సూపర్ హిట్ లు సాధించిన స్టార్ హీరో అమిర్ ఖాన్ మహారాజ హిందీ రైట్స్ కొనుగోలు చేసారు. అమిర్ గత చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ ఎన్నో అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచింది. మరి మహారాజని యధావిధిగా రీమేక్ చేస్తారా లేదా మార్పులు చేర్పులు చేస్తారా అన్నది తెలియాలి. ఇటీవల బాలీవుడ్ కు రీమేక్ లు కలిసి రాలేదు. స్టార్ హీరో అక్షయ్ కుమార్ తమిళ హీరో సూర్య నటించినఆకాశమే నీ హద్దురా చిత్రాన్ని రీమేక్ చేయగా భారీ డిజాస్టర్ గా నిలిచింది. మరి  మహారాజతో అమిర్ ఏ మాత్రం ఆకట్టుకుంటాడో.

Also Read : Mr Bachchan: రవితేజ సినిమాలో యంగ్ హీరో గెస్ట్ రోల్..ఎవరంటే.?

Show comments