NTV Telugu Site icon

Mahalakshmi: నిర్మాత బరువు తగ్గడం లేదని భార్య మహాలక్ష్మి షాకింగ్ నిర్ణయం.. ఇదే కదా లవ్వంటే?

Mahalakshmi Husband

Mahalakshmi Husband

Mahalakshmi Crucial Decision on Her Husbands Weight: తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖర్ అంటే గుర్తు పట్టడం కష్టమే ఏమో కానీ సీరియల్ నటిని పెళ్లి చేసుకున్న బాగా బరువున్న నిర్మాత అంటే ఈజీగా గుర్తుపడతారు. సీరియల్ నటిగా ఉన్న మహాలక్ష్మితో రవీందర్‌ కు పరిచయం ఏర్పడగా ఇద్దరూ కొంత కాలానికి ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఇద్దరికీ ఇది రెండో పెళ్లయినా ఆ సమయంలో మహాలక్ష్మి గురించి నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేశారు. కేవలం డబ్బు మీద ఉన్న ఆశతోనే ఆయనను పెళ్లి చేసుకుందని, ఇద్దరికీ అసలు పొంతనే లేదని కూడా కామెంట్లు చేశారు. వీరి పెళ్లి రహస్యంగా జరగగా కొద్ది రోజుల ఆర్వాత ఆయన పెళ్లి ఫోటోలు బయటకు వచ్చాక ఎన్నో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.

NTV Film Roundup: ఫిలిం సిటీలో దేవర, నా సామిరంగా అంటున్న నాగ్.. టాలీవుడ్లో నేటి షూటింగ్ అప్డేట్స్ ఇవే!

ఇప్పుడు వీరు ఎవరి కామెంట్లు పట్టించుకోకుండా తమ సంసార జీవితాన్ని గడుపుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహాలక్ష్మి తన వివాహ జీవితం గురించి కీలక విషయాలు బయట పెట్టింది. తమ పెళ్లి తర్వాత నెటిజన్లు చేసిన విమర్శలు చాలా బాధ కలిగించాయని, అయితే కొద్ది రోజుల తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశామని ఆమె చెప్పుకొచ్చింది. తన భర్త చాలా బరువు ఉన్న మాట వాస్తవమే కానీ, ఆయన చాలా మంచివారని, నా కోసం బరువు తగ్గేందుకు ప్రయత్నించారు కానీ, ఆయన ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదని పేర్కొంది.. ఈ నేపథ్యంలో తానే ఓ నిర్ణయం తీసుకున్నానని ఆయన బరువు తగ్గడు కాబట్టి, నేనే ఆయనలా బరువు పెరగాలి అనుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చింది. బరువు పెరిగే ఫుడ్ తీసుకుంటున్నానని ముఖ్యంగా రాత్రి పూట ఎక్కువగా తింటున్నా, తినగానే నిద్రపోతున్నాను, ఎలాగైనా ఆయన మాదిరిగా మారాలి అనుకుంటున్నా, అప్పుడైనా ఈ ట్రోల్స్ ఆగిపోతాయేమో చూస్తానని చెప్పుకొచ్చింది.

Show comments