NTV Telugu Site icon

గూజ్ బంబ్స్ తెప్పిస్తున్న ‘మహా సముద్రం’ ట్రైలర్!

మచ్ అవైటెడ్ మూవీ ‘మహా సముద్రం’ ట్రైలర్ వచ్చేసింది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ కు ఎమోషన్స్ ను మిక్స్ చేసి డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించిన ఈ ట్రైలర్ చూస్తే గూజ్ బంబ్స్ రావడం ఖాయం. హీరోలు సిద్ధార్థ్, శర్వానంద్ తో పాటు హీరోయిన్లు అదితీరావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ సైతం ఇంటెన్సివ్ క్యారెక్టర్స్ చేసినట్టు ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ఇక జగపతిబాబు, రావు రమేశ్, రామచంద్రరాజు ప్రతినాయకులుగా అద్భుతమైన నటన కనబరిచారు. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్ళినట్టు రెండు నిమిషాలు ఇరవై మూడు సెకన్ల ట్రైలర్ చూస్తే తెలిసిపోతోంది. లవ్, యాక్షన్, ఎమోషన్స్ తో మిళితమైన ‘మహా సముద్రం’ ట్రైలర్ ను చూస్తుంటే, డైరెక్టర్ లోని కసితో పాటు, అతను ఆర్టిస్టుల నుండి ఏ స్థాయిలో నటన రాబట్టాడో స్పష్టం అవుతోంది. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో సుంకర రాంబ్రహ్మం నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ హైలైట్స్. అక్టోబర్ 14న దసరా కానుకగా రాబోతున్న ‘మహా సముద్రం’తో డైరెక్టర్ అజయ్ భూపతి చిరకాల స్వప్నాన్ని వెండితెరపై సాక్షాత్కరింపచేయడం ఖాయంగా కనిపిస్తోంది.