Site icon NTV Telugu

“మహా సముద్రం” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను టైం ఫిక్స్

Maha Samudram Pre Release event on Oct 9th

“ఆర్ఎక్స్ 100” ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ “మహా సముద్రం”. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో సిద్దార్థ్ తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. “మహా సముద్రం” కమర్షియల్ అంశాలతో కూడిన ప్రేమ కథ. ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతుండగా టీమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. “మహా సముద్రం” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు టైం, డేట్, ప్లేస్ ను ఖరారు చేస్తూ తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అక్టోబర్ 9 న జెఆర్‌సి కన్వెన్షన్‌లో లో ‘మహా సముద్రం’ సాయంత్రం 6 గంటలకు జరగనుంది.

Read Also : అఫిషియల్ : “ప్రభాస్ 25” టైటిల్ అనౌన్స్మెంట్

శర్వానంద్, సిద్ధార్థ్ మధ్య నీటి అడుగున చేసే ఫైట్ సినిమాలోని హైలెట్ లలో ఒకటి. ఈ చిత్రంలో జగపతి బాబు, రావు రమేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. అక్టోబర్ 14 న “మహా సముద్రం” థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version