Site icon NTV Telugu

Madonna: లేటు వయసులో ఘాటుగా మడోన్నా నాటు చేష్టలు!

Madonna

Madonna

Madonna: వయసుతో పనియేముంది? మనసులోనే అంతా ఉంది అంటూ సాగుతోంది అరవై నాలుగేళ్ళ పాప్ క్వీన్ మడోన్నా. తన పిల్లల కంటే ఎంతో చిన్నవాడయిన 29 ఏళ్ళ బాక్సర్ జోష్ పాపర్ తో సరసాల యాత్ర సాగిస్తోందట మడోన్నా! మొన్నటి దాకా ఇది ఒట్టి పుకారే అనుకున్నారు చాలామంది. ముఖ్యంగా మడోన్నా ఆరాధకులు దీనిని కొట్టి పారేశారు. కానీ, జోష్ పాపర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సామ్ ఫెహెర్ వారిద్దరి బండారం బట్టబయలు చేసింది.

‘సమ్మర్ హౌస్’ సీజన్ 7లో నటించిన సామ్ ఫెహెర్ సొంతగా ఓ వెబ్ నడుపుతూ సాగుతోంది. తనకు తానే ఎంతో కంటెంట్ సృష్టించుకొనే సత్తా ఉన్న సామ్ ఫెహెర్, కొన్నాళ్ళ కిందటే జోష్ పాపర్ తో తెగతెంపులు చేసుకుంది. కారణం, అతని విచ్చలవిడి తనమేనట! అంతే కాదు ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యహరించే జోష్ పై తనకు ఎంత ప్రేమ ఉన్నా, వదిలించుకున్నానని చెబుతోంది. అయితే అతనిలో ఓ మంచి మనసు ఉందనీ ఆమె అంటోంది. జోష్ తో తాను గడిపినప్పుడు అతని దగ్గర వదిలేసిన వస్తువులను అదే పనిగా మడోన్నా తీసుకుపోవాలని చూస్తోందట! అసలు తాను వదిలేసిన వాటిని మాజీ ప్రియుడు కాబట్టి జోష్ భద్రపరచుకున్నాడు. వాటిని కూడా పట్టుకుపోవాలని చూస్తోందంటే మడోన్నా తనను కాపీ కొడుతోందని సామ్ ఆరోపణ. అసలు ఆమెను ఏమనాలి అంటూ ప్రశ్నిస్తోంది సామ్. ఇదిలా ఉంటే తనకున్న మీడియా కాంటాక్ట్స్ ద్వారా మడోన్నా లాంటి టాప్ స్టార్ ను సామ్ డీఫేమ్ చేస్తోందని మడోన్నా ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులోని నిజానిజాలు తేలితే, సామ్ కు తమ తడాఖా చూపిస్తామనీ మడోన్నా అభిమానులు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version