Site icon NTV Telugu

Madhuri Dixit : అభిమానుల ఆగ్రహానికి బలైన మాధురి దీక్షిత్ – డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ రచ్చ!

Madhuri Dixthith

Madhuri Dixthith

బాలీవుడ్‌ ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌కు కెనడాలో జరిగిన తాజా లైవ్‌ షో పెద్ద తలనొప్పి అయింది. షో ప్రారంభ సమయం రాత్రి 7:30 గా ప్రకటించగా, మాధురీ దాదాపు 3 గంటల ఆలస్యంగా అంటే రాత్రి 10 గంటల తర్వాత స్టేజ్‌పైకి రావడంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు టికెట్లు తీసుకుని వేచి ఉండగా, ఈవెంట్‌ నిర్వాహకులు ఎలాంటి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో కోపం మరింత పెరిగిందట. మాధురీ వేదికపైకి వచ్చిన తర్వాత కేవలం కొద్ది సేపు మాత్రమే మాట్లాడి, ఒక్కో పాటకు రెండు మూడు స్టెప్స్‌ వేయడమే చేయడంతో అభిమానులు నిరాశ చెందారు.

Also Read : Mastiii 4 Trailer: మళ్లీ మస్తీ మోడ్‌లో.. రితీశ్‌ దేశ్‌ముఖ్ ‘మస్తీ 4’ ట్రైలర్‌ రిలీజ్‌

ఒక నెటిజన్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “ఇది నా జీవితంలో చూసిన చెత్త షో. మాధురీ ఆలస్యంగా వచ్చారు, ప్రదర్శన కూడా చాలా బోరింగ్‌గా ఉంది” అంటూ ఫైర్ అయ్యాడు. మరొకరు, “షో మొదలు కాకముందే వెళ్ళిపోవాల్సి వచ్చింది, సమయం పూర్తిగా వృధా అయింది” అంటూ నిరాశ వ్యక్తం చేశారు. ఇక, అసంతృప్తి చెందిన పలువురు ప్రేక్షకులు టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనపై వీడియోలు, పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుండగా, అభిమానుల నుంచి మాధురీ టీమ్‌ స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version