సమంతా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సమంతా, శకుంతలా దేవిగా నటిస్తుండగా దేవ్ మోహన్ దుష్యంతునిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 14కి వాయిదా పడింది. క్వాలిటీ కోసమే సినిమాని వాయిదా వేశామని చెప్తున్న మేకర్స్, ఈ మూవీ నుంచి నాలుగో సాంగ్ ని రిలీజ్ చేశారు. మధుర గతమా అనే ఈ సాంగ్ శాకుంతలం సినిమాలో చాలా ముఖ్యమైన సన్నివేశంలో వచ్చే అవకాశం ఉంది. శకుంతలా పోగొట్టిన ఉంగరం, ఒక మచ్చకరుడి నుంచి తిరిగి తన దగ్గరకి రావడంతో దాన్ని చూసిన దుష్యంతుడు గతం గుర్తొచ్చి… శాకుంతల తన భార్య అని జ్ఞాపకం తెచ్చుకునే ప్రాసెస్ లో ఈ మధుర గతమా అనే సాంగ్ వచ్చేలా ఉంది.
శాకుంతలం సినిమాకి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ, మరోసారి బ్యూటిఫుల్ ట్యూన్ ఇచ్చాడు. ఈ ట్యూన్ ని శ్రీరమణి లిరిక్స్ రాయగా అర్మాన్ మాలిక్-శ్రేయ ఘోషల్ గొంతు కలిపారు. ఈ ఇద్దరి వాయిస్ లో మధుర గతమా సాంగ్ చాలా స్పెషల్ గా వినిపిస్తోంది. లిరికల్ సాంగ్ లో అక్కడక్కడా ప్లే చేసిన విజువల్ ఎఫెక్ట్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ముఖ్యంగా సమంతా చాలా అందంగా ఉంది. సాంగ్ లో జరిగిన మ్యాజిక్ ఏదైనా ఉందా అది సమంతా చార్మ్ మాత్రమే. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కి మిగిలిన ఎలిమెంట్స్ కూడా కలిసి పాటని మరింత స్పెషల్ గా మార్చాయి. సాంగ్స్ తో ప్రమోషన్స్ ని ముందుకి తీసుకోని వెళ్తున్న మేకర్స్, ఇదే జోష్ ని మరో రెండు నెలల పాటు మైంటైన్ చేస్తే శాకుంతలం సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇతర భాషల్లో శాకుంతలం సినిమా అనుకున్నంత బజ్ ని క్రియేట్ చెయ్యలేకపోతుంది. దిల్ రాజు అండ్ టీం ఈ విషయంలో కాస్త దృష్టి పెడితే పాన్ ఇండియా మార్కెట్ లో మంచి కలెక్షన్స్ ని రాబట్టడానికి ఛాన్స్ ఉంది.
Feel the yearning for love 🤍#MadhuraGathamaa #MadhuraKalTu #MadhuraGathaBaa #MayakkumPozhudhe from #Shaakuntalam out now!https://t.co/bgwEQvMR51@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/aBr1WmdFZ0
— Gunaa Teamworks (@GunaaTeamworks) February 14, 2023