Site icon NTV Telugu

Madhavan : ఈ పద్దతి రజనీకాంత్‌ నుండే నేర్చుకున్న..

R Madhavan

R Madhavan

భిన్నమైన పాత్రలతో, తన నటనతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విలక్షణ నటుడు ఆర్‌. మాధవన్‌. హీరోగా, విలన్‌గా, లవర్ బాయ్‌గా.. ఏ పాత్రలో నటించిన తనదైన స్టైల్లో మెప్పిస్తారు. తాజాగా విడుదలైన ‘ఆప్‌ జైసా కోయి’తో మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్న మాధవన్‌.. 40 ఏళ్ల వయసున్నా పెళ్లి కాని ప్రసాద్‌గా ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన సినీప్రయాణం, అవార్డులపై తన అభిప్రాయం, సింపుల్ లైఫ్‌స్టైల్ వెనుక రజనీకాంత్‌ నుంచి నేర్చుకున్న విషయాలు పంచుకున్నారు.

Also Read : Akhanda 2 : డ్రగ్స్‌పై బాలయ్య వార్.. బోయపాటి స్టైల్‌లో మాస్ ట్రీట్మెంట్!

మాధవన్ మాట్లాడుతూ.. “అవార్డులు నాకు ముఖ్యం కావు. ప్రేక్షకులు నేను గొప్ప నటుడిని అనుకోవడమే నాకు పెద్ద అవార్డు. మన పరిశ్రమలో దిలీప్‌కుమార్‌ లాంటి దిగ్గజానికి కూడా జాతీయ అవార్డు రాలేదు. కానీ ఆయన చేసిన సినిమాలు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అవార్డులు కంటే ప్రేక్షకుల మెప్పే ముఖ్యం. రజనీ సార్‌ ఆఫ్‌స్క్రీన్‌లో చాలా సింపుల్‌గా ఉంటారు. కానీ తెరపై మాత్రం మ్యాజిక్‌ సృష్టిస్తారు. అదే నాకు ప్రేరణ. నా ఫ్రెండ్‌ అజిత్‌కుమార్‌ కూడా ఇంతే. మనం ఇతరులతో పోటీ పడాల్సిన అవసరం లేదు. మనలోని నటుణ్ని బయటకు తీయాలి” అని అన్నారు. తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ గురించి మాట్లాడిన మాధవన్‌ “నేను బాగా తింటాను, ఆకలితో ఉండను. సమయానికి నిద్రపోతాను. అందుకే ఈ వయసులో కూడా ఫిట్‌గా ఉన్నాను” అని తెలిపారు. తన కొడుకు వేదాంత్‌ నటనలోకి రాకపోవడంపై ప్రశ్నించగా, “అతనికి స్విమ్మింగ్‌ అంటే ఇష్టం. నేను నా నాన్న వృత్తిని ఫాలో కాలేదు, మరి నా కొడుకు ఎందుకు నన్ను ఫాలో కావాలి? తనదైన మార్గంలో ముందుకు వెళ్తున్నాడు. అదే నాకు ఆనందం” అని చెప్పారు.

Exit mobile version