MAD Movie: ‘మ్యాడ్’తో గట్టి హిట్ కొడుతున్నాం అన్నారూ.. కొట్టి చూపించాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MAD Movie Sucess meet: నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన ‘మ్యాడ్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించగా కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయయ్యారు. ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రీమియర్స్ వేయగా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి వసూళ్లను కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ అందరూ కొత్త వాళ్ళు కలిసి చేసిన ఈ సినిమా బాగుంది, ఆడియన్స్ కి నచ్చుతుందని నమ్మకంతో ఈ సినిమాకి కాన్ఫిడెంట్ గా ప్రమోట్ చేశాము. కొత్త వాళ్ళు నటించిన ఈ సినిమాకు ఇంత మంచి ఓపెనింగ్స్ రావడం సంతోషంగా ఉందని, ఇలాంటి సినిమాలు చేయడానికి మరింత ధైర్యం వచ్చిందని అన్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబడుతుందని పేర్కొన్న ఆయన మీడియా నుంచి కూడా ఈ సినిమాకి మంచి స్పందన లభించిందని అన్నారు.
ఇక దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ఇది నా మొదటి సినిమా అని అందరం యంగ్ స్టర్స్ కలిసి చేశామని అన్నారు. వంశీ అన్న ఒక్కటే మాట గట్టిగా కొడుతున్నాం అన్నాడు, ఆయన అన్నట్టుగానే జరిగింది. పాజిటివ్ టాక్ రావడంతో చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇక సంగీత్ శోభన్ మాట్లాడుతూ మా గురించి జనాలు మాట్లాడుకోవడం అనేది మా ఫస్ట్ సక్సెస్ అని,మంచిగా మాట్లాడుకోవడం అనేది మా సెకండ్ సక్సెస్ అని అన్నారు. అందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు. నార్నే నితిన్ మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది, బాగా ఆడుతుంది అని ముందే ఊహించాం కానీ ఈ స్థాయి రెస్పాన్స్ మాత్రం అసలు ఊహించలేదనని అన్నారు. చాలా సంతోషంగా ఉంది, మాటలు రావడం లేదు, థియేటర్లలో ప్రతి ఒక్కరు సినిమాని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారని అన్నారు. మరోపక్క రామ్ నితిన్ మాట్లాడుతూ నాకింకా కలలో ఉన్నట్లు ఉందని, ఇంతమంచి సినిమాతో పరిచయం అవుతానని అసలు ఊహించలేదని అన్నారు. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!