Site icon NTV Telugu

MAD Collections: డే 1 కన్నా డే 2 ఎక్కువ… అన్ని సెంటర్స్ హాజ్ ఫుల్

Mad

Mad

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన చిన్న సినిమా ‘మ్యాడ్’. కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా సితారా బ్యానర్ కి సాలిడ్ డబ్బులు ఇచ్చేలా కనిపిస్తుంది. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడం, కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సినిమా అనే పేరు తెచ్చుకోవడం, ముగ్గురి స్నేహితుల జర్నీ ఈ సినిమా అని వినిపించడంతో మ్యాడ్ సినిమాని చూడడానికి యూత్ థియేటర్స్ కి వెళ్లిపోయారు. దీంతో డే 1 మ్యాడ్ మూవీ 1.8 కోట్లని రాబట్టింది.

సాలిడ్ ఓపెనింగ్ రాబట్టిన ఈ చిన్న సినిమాకి మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండడం బాగా హెల్ప్ అయ్యింది. కుర్రాళ్లు డే 2 మ్యాడ్ సినిమాని చూడడానికి థియేటర్స్ కి ఎగబడ్డారు. దీంతో డే 1 కన్నా డబుల్ కలెక్షన్స్ డే 2కి వచ్చాయి. ఓవరాల్ గా రెండు రోజుల్లో మ్యాడ్ మూవీ 4.7 కోట్లని రాబట్టింది. సండే కలెక్షన్స్ మరింత ఎక్కువా ఉండే అవకాశం ఉంది. డే 2 కన్నా మూడో రోజు మ్యాడ్ సినిమా కలెక్షన్స్ లో మంచి జంప్ కనిపించే అవకాశం ఉంది. అక్టోబర్ 19 వరకూ మ్యాడ్ సినిమాని ఆపే మూవీ లేదు కాబట్టి లాంగ్ రన్ లో మ్యాడ్ సాలిడ్ నంబర్ ని పోస్ట్ చేయడం గ్యారెంటీ.

Read Also: Samantha Ruth Prabhu: పింక్ కలర్ శారీ అందాలతో పిచ్చెక్కిస్తున్న సమంత రూత్ ప్రభు…

Exit mobile version