Maamannan to Stream on Netflix from July 27th: ఉదయనిది స్టాలిన్ హీరోగా మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన తాజా చిత్రం మామన్నన్. తెలుగులో ఈ సినిమాని నాయకుడు పేరుతో జూలై 14 వ తేదీన రిలీజ్ చేశారు. నిజానికి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది, ఉదయనిది స్టాలిన్ చివరి చిత్రం అని ప్రచారం చేయడంతో తమిళ ప్రేక్షకులు అందరూ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించారు. ఇక ఈ సినిమాలో వడివేలు ఒక సీరియస్ పాత్రలో నటించడం, పుష్ప సినిమాతో మనకి పరిచయం అయిన ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ గా నటించడంతో పాటు కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. అయితే బేబీ లాంటి బజ్ ఉన్న సినిమా రిలీజ్ అవుతున్న రోజే ఈ సినిమాని రిలీజ్ చేయడంతో పాటు అదే రోజు మరో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ మావీరన్ తెలుగు డబ్ద్ వర్షన్ మహావీరుడు కూడా రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ నాయకుడు సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ ఇంతే లభించలేదు.
Guntur Kaaram: అన్నా..వెకేషన్లో సినిమా చేస్తున్నావా?.. సినిమా మధ్యలో వెకేషన్ తీసుకుంటున్నావా?
ఇక ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాని ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమ్ అవుతున్నట్లుగా అధికారిక ప్రకటన వెల్లడైంది. కేవలం తమిళ వర్షన్ మాత్రమే కాదు నెట్ఫ్లిక్స్ లో తెలుగు సహా కన్నడ, మలయాళ వెర్షన్స్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ కులానికి చెందిన ఒక ఎమ్మెల్యేని పెద్ద కులానికి చెందిన నాయకుడు ఇబ్బంది పెట్టే అంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. లాల్ ముఖ్యమంత్రి పాత్రలో నటించిన ఈ సినిమా తమిళంలో వర్కౌట్ అయినా తెలుగులో మాత్రం ఎందుకో వర్కౌట్ అవలేదు. అయితే ఓటీటీలో తెలుగు ప్రేక్షకులు చూసి ఆదరించే అవకాశం ఉందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో.