Site icon NTV Telugu

Maama Mascheendra Trailer: మామను చెడుగుడు ఆడడానికే పుట్టిన అల్లుళ్ల కథ ..

Mama

Mama

Maama Mascheendra Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు హీరో సుధీర్ బాబు. అయితే మహేష్ బావ అని కాకుండా మంచి కథలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఇక గతేడాది కొన్ని పరాజయాలను తన ఖాతాలో వేసుకున్నా కూడా.. మంచి అవకాశాలను అందుకొని కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం మామ మశ్చీంద్ర. నటుడు, కమెడియన్ హర్షవర్ధన్ ఈ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఇక ఈ చిత్రంలో సుధీర్ సరసన ఈషా రెబ్బ, మిర్నలిని రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో సుధీర్ బాబు.. మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ట్రైలర్ విషయానికొస్తే ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Naseeruddin Shah: ‘ఆర్ఆర్ఆర్, పుష్ప’పై సీనియర్ నటుడు సంచలన ఆరోపణలు

సుధీర్ కు ఇద్దరు కూతుళ్లు ఈషా, మిర్నలిని.. ఆ ఇద్దరు.. సేమ్ తన తండ్రిలా ఉండే ఇద్దరు కుర్రాళ్లను ప్రేమిస్తారు. వారిని చూసి ముందు సుధీర్ ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత వారు తన చెల్లి కొడుకులు అని, తన చెల్లిని చంపింది కూడా తానే కానీ, అప్పుడు ఆ పిల్లలు అక్కడ లేరని వదిలేసి వచ్చాను అని చెప్పడంతో.. సుధీర్ మేనల్లుళ్లే హీరోలు అని.. ఇద్దరు కూడా ట్విన్స్ అని తెలుస్తోంది. అయితే.. వారి తల్లిదండ్రులను చంపిన మేనమామ మీద పగ తీర్చుకోకుండా మరదళ్ళతో ప్రేమ వ్యవహారం సాగిస్తుండడం సుధీర్ కు నచ్చదు. దీంతో వారిద్దరిని కూడా చంపేయాలని సుధీర్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. దీంతో ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒక్కటై.. మేనమామను ఏం చేశారు..? సొంత చెల్లిని సుధీర్ ఎందుకు చంపాల్సివచ్చింది.. ? మాయ మశ్చీంద్రలుగా వచ్చిన అల్లుళ్లకు ఈ మామ మశ్చీంద్ర ఏం చేశాడు ..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా మొత్తానికి హైలైట్ అంటే సుధీర్ అనే చెప్పాలి. మూడు విభిన్నమైన పాత్రల్లో అదరగొట్టేశాడు. ఇక చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ చాలా కొత్తగా అనిపించింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రంతో సుధీర్ బాబు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version