MAA : టాలీవుడ్’పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కామెంట్స్.. మా ఖండన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి ఇటీవల సినీ ప్రముఖులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ప్రెసిడెంట్ విష్ణు మంచు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి స్పందించారు. ఎమ్మెల్యే సూచనపై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వాస్తవాలను గుర్తుచేశారు. “మంచి సూచన. అయితే, ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ముందు రాజకీయ నాయకులకు ఉండాల్సిన సమానమైన పరీక్ష ఏంటో అని నేను ఆలోచిస్తున్నాను? గౌరవనీయులైన ఎమ్మెల్యే గారితో కలిసి అటువంటి ఉమ్మడి నిబంధనలపై పని చేయడానికి ఓటర్లు ఖచ్చితంగా సంతోషిస్తారు.” అని అన్నారు.
Also Read : Hydra: ‘ఆ ఇళ్ల జోలికి వెళ్లం’.. గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా..
Also Read
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
- Varanasi Movie: 'వారణాసి'లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
ఇక తాజాగా ‘మా’ ఉపాధ్యక్షుడు మాదాల రవి మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ క్రమశిక్షణతో కూడుకున్నదని, ఈ వ్యాఖ్యలు అసహ్యకరమైన ఆధారం లేని మాటలు. సమాజ అభివృద్ధిలో తమ వంతు పాత్రను ఎప్పుడూ పోషిస్తూనే ఉందని ఆయన తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ఉన్నత విద్యావంతులు ఉన్నారని, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు అందుకున్న మహనీయులు ఈ రంగంలో ఉన్నారని గుర్తుచేశారు. ఎన్.టి. రామ రావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, కృష్ణం రాజు, చిరంజీవి, మాదాల రంగ రావు, ఆర్. నారాయణ మూర్తి లాంటి దిగ్గజాలు సినిమాల ద్వారా సమాజానికి శక్తివంతమైన సందేశాలను అందించారు. ప్రస్తుత నటులు చాలామంది నేషనల్ మరియు ఇంటర్నేషనల్ లెవెల్ లో పేరు ప్రేఖ్యతలు సంపాదించుకున్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడూ ముందుంటుందని మాదాల రవి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో కలిసి ‘మా’ సన్నిహితంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. చిరంజీవి, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి అగ్ర నటులు యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు చురుగ్గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని గుర్తుచేశారు.
పరిశ్రమ తన సామాజిక బాధ్యతలకు కట్టుబడి ఉంటుందని మరియు డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా అంతం చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?