Tollywood : టాలీవుడ్‌కు ఒక గట్టి గుణపాఠం నేర్పిన మా ఇంటి బంగారం, లెనిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో సినిమా విడుదలైతే చాలుటికెట్ ధరలు పెంచేయడం, బుక్ మై షో రేటింగ్స్‌ను మేనేజ్ చేయడం లేదా కోర్టు ఆర్డర్స్ తెచ్చి రేటింగ్స్ ఆపాలని చూడడం, తెల్లవారుజామునే ప్రీమియర్ షోల హడావుడి చేయడం, చివరకు సినిమా నచ్చలేదని రివ్యూ రాసిన రివ్యూవర్లపై బెదిరింపులకు దిగడం వంటి ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు పెద్ద నిర్మాతలు, స్టార్ హీరోలు. తమ సినిమా ప్లాప్ అని తేలిపోతుందనే భయంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఇలాంటి పద్ధతులు వాడుతున్నారు. కానీ ప్రేక్షకులను ఇలాంటి జిమ్మిక్కులతో మోసం చేయలేరని రుజువు చేస్తూ మా ఇంటి బంగారం, లెనిన్ సినిమాలు ఘన విజయం సాధించాయి.
సమంత ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం‘ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకుండా నార్మల్ టికెట్ ధరలతో కేవలం కంటెంట్ బలాన్ని నమ్ముకుని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫలితంగా తెలుగు సినీ చరిత్రలోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన మొట్టమొదటి లేడి ఓరియెంటెడ్ సినిమాగా రికార్డు సృష్టించింది.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
మరోవైపు అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్‘ కూడా ఎలాంటి స్పెషల్ బెనిఫిట్స్, టికెట్స్ ప్రైసింగ్ లేకుండా రిలీజ్ అయి అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించి సత్తా చాటింది. నిజాయితీ గల కంటెంట్‌తో థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు సినిమాలు సాధించిన విజయం ప్రమోషన్ల పేరుతో ప్రేక్షకులపై భారం వేసే స్టార్ హీరోలకు, కార్పొరేట్ ప్రొడక్షన్ హౌస్‌లకు ఒక బలమైన చెంపపెట్టు. ప్రేక్షకుల రేటింగ్స్‌ను అడ్డుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగడం, రివ్యూవర్లను బెదిరించడం వంటి వ్యూహాలు కాకుండా… సినిమా కథపై కథనంపై దృష్టి పెడితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ విజయాలు నిరూపించాయి.
ఇప్పటికైనా నిర్మాతలు, స్టార్స్ తమ పాత పద్ధతులను, అనవసరమైన వ్యూహాలను పక్కన పెట్టాలి. సినిమా విధిరాతను నిర్ణయించే అధికారాన్ని ప్రేక్షకుడికి వదిలేయాలి. ఎందుకంటే ప్రేక్షకుడు ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటాడు నిజమైన ప్రతిభను మంచి సినిమాను ఎల్లప్పుడూ ఆదరిస్తారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!