Ma Oori Raja Reddy Movie Trailer Launched: నిహాన్ హీరోగా, వైష్ణవి కాంబ్లే హీరోయిన్ గా రవి బాసర దర్శకత్వంలో ఆర్ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ నిర్మాతలుగా మా ఊరి రాజారెడ్డి అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇక మార్చ్ 1న గ్రాండ్ గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్న సినిమా యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది. ఇక ఈ వేడుకలో ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ వేణుగోపాల చారి మాట్లాడుతూ మా ఊరి రాజారెడ్డి అనే సినిమా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని గుర్తుచేసేలా ఉంటుంది, ఆయన అంచెలంచెలుగా రాజకీయాల్లో ఒక నిష్ణాతుడైన ముఖ్యమంత్రిగా ఎదిగిన కథను మన ముందుకు తీసుకొస్తున్నారని అన్నారు. ఆయన మంచితనానికి నిదర్శనంగా ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని న్నారు. ఈ చిత్రంలో నటించిన వాళ్లు సాంకేతిక నిపుణులు అందరూ నిర్మల్ ప్రాంతం వాళ్ళు కావడం నిజంగా ఆనందదాయకమని అన్నారు.
తెలంగాణలో నిర్మల్, అదిలాబాద్, వరంగల్ లాంటి ప్రదేశాల్లో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా అద్భుతమైన వాటర్ ఫాల్స్ అటవీ ప్రాంత లోకేషన్లు మన దగ్గర ఉన్నాయని అన్నారు. హీరో నిహాన్ మాట్లాడుతూ హీరోయిన్ వైష్ణవి చాలా బాగా నటించింది, చాలా కష్టపడి సినిమాని చాలా మంచి లొకేషన్స్ లో షూట్ చేశాం. ఈ సినిమాను ప్రేక్షకులు చూసి మమ్మల్ని ఆశీర్వదించి మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. హీరోయిన్ వైష్ణవి మాట్లాడుతూ అమ్మాయి ఇండస్ట్రీలు ఎదగడం అనేది చాలా కష్టం అది పేరెంట్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది. మా పేరెంట్స్ ని నెమ్మదిగా ఒప్పించి ఇండస్ట్రీలోకి వచ్చా, కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందన్నారు. నిహాన్, వైష్ణవి కాంబ్లేతో పాటు ఎర్ర రవీందర్, రజిని, అయిత వెంకటరమణ, ఆర్. ప్రభుదాస్, రాధిక, కుమార్, కోటగిరి నరసయ్య చారి, కోట్టే చంద్రశేఖర్ నటించిన ఈ సినిమాకి డి ఓ పి వాసు కాగా మ్యూజిక్ పీకే అందించారు.
