Ma Oori Raja Reddy Movie Trailer: రాజశేఖర్ రెడ్డిని గుర్తుచేసేలా ‘మా ఊరి రాజారెడ్డి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ma Oori Raja Reddy Movie Trailer Launched: నిహాన్ హీరోగా, వైష్ణవి కాంబ్లే హీరోయిన్ గా రవి బాసర దర్శకత్వంలో ఆర్ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ నిర్మాతలుగా మా ఊరి రాజారెడ్డి అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇక మార్చ్ 1న గ్రాండ్ గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్న సినిమా యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది. ఇక ఈ వేడుకలో ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ వేణుగోపాల చారి మాట్లాడుతూ మా ఊరి రాజారెడ్డి అనే సినిమా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని గుర్తుచేసేలా ఉంటుంది, ఆయన అంచెలంచెలుగా రాజకీయాల్లో ఒక నిష్ణాతుడైన ముఖ్యమంత్రిగా ఎదిగిన కథను మన ముందుకు తీసుకొస్తున్నారని అన్నారు. ఆయన మంచితనానికి నిదర్శనంగా ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని న్నారు. ఈ చిత్రంలో నటించిన వాళ్లు సాంకేతిక నిపుణులు అందరూ నిర్మల్ ప్రాంతం వాళ్ళు కావడం నిజంగా ఆనందదాయకమని అన్నారు.
తెలంగాణలో నిర్మల్, అదిలాబాద్, వరంగల్ లాంటి ప్రదేశాల్లో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా అద్భుతమైన వాటర్ ఫాల్స్ అటవీ ప్రాంత లోకేషన్లు మన దగ్గర ఉన్నాయని అన్నారు. హీరో నిహాన్ మాట్లాడుతూ హీరోయిన్ వైష్ణవి చాలా బాగా నటించింది, చాలా కష్టపడి సినిమాని చాలా మంచి లొకేషన్స్ లో షూట్ చేశాం. ఈ సినిమాను ప్రేక్షకులు చూసి మమ్మల్ని ఆశీర్వదించి మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. హీరోయిన్ వైష్ణవి మాట్లాడుతూ అమ్మాయి ఇండస్ట్రీలు ఎదగడం అనేది చాలా కష్టం అది పేరెంట్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది. మా పేరెంట్స్ ని నెమ్మదిగా ఒప్పించి ఇండస్ట్రీలోకి వచ్చా, కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందన్నారు. నిహాన్, వైష్ణవి కాంబ్లేతో పాటు ఎర్ర రవీందర్, రజిని, అయిత వెంకటరమణ, ఆర్. ప్రభుదాస్, రాధిక, కుమార్, కోటగిరి నరసయ్య చారి, కోట్టే చంద్రశేఖర్ నటించిన ఈ సినిమాకి డి ఓ పి వాసు కాగా మ్యూజిక్ పీకే అందించారు.
Also Read
- Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్మార్క్ సెట్ చేయబోతుందా?
- Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
- Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
- Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
తాజావార్తలు
-
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
-
Volkswagen Tayron: వోక్స్వ్యాగన్ టేరాన్ లైఫ్ లాంచ్.. 9 ఎయిర్బ్యాగ్స్, లెవెల్-2 ADASతో ప్రీమియం SUV.. ధర, ఫీచర్లు ఇవే
-
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్మార్క్ సెట్ చేయబోతుందా?
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
-
Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!