Site icon NTV Telugu

Polimera 2: ‘మా ఊరి పొలిమేర -2`.. ఈసారి థియేటర్లో వణకాల్సిందే

Maa Oori Polimera

Maa Oori Polimera

‘Ma Oori Polimera-2’ to release on November 3 in grand scale: కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ నేపథ్య చిత్రాలను మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేడి.. ఆ కోవలోనే వచ్చిన వైవిధ్యమైన చిత్రం ’మా ఊరి పొలిమేర ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం మా ఊరి పొలిమేరకి సీక్వెల్ గా ‘మా ఊరి పొలిమేర 2” చిత్రీకరణ పూర్తి చేసుకుమొ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లో విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాను చూసి ఎంతగానో నచ్చిన ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ చిత్ర హక్కులను ఫ్యాన్సీ రేటుతో కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా రూపొందుతున్న ఈ సినిమాకి డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడుగా వ్యవహరించారు.

Dil Raju: ప్రకాశ్ రాజ్ ని పట్టుకుని భోరున ఏడ్చేసిన దిల్ రాజు

స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకేందుమౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా ద‌ర్శ‌కుడు డా.అనిల్ విశ్వ‌నాథ్ మాట్లాడుతూ గ్రామీణ నేప‌థ్యంలో జ‌రిగే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి మా ఊరి పొలిమేర‌-2 చిత్రాన్ని తెర‌కెక్కించామని, మొద‌టి పార్ట్ క‌న్నా సెకండ్ పార్ట్ ఇంకా ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌బోతుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవిక సంఘటనలను ఈ చిత్రంలో జోడించామని, ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. వాట్ నెక్ట్స్ అనేది ఎవరూ ఊహించలేరని అన్నారు. పాడేరు, కేర‌ళ‌, ఉత్త‌రాఖండ్ లో షూటింగ్ చేశామని పేర్కొన్న ఆయన స‌త్యం రాజేష్‌, కామాక్షి అద్భుతంగా న‌టించారు. నవంబ‌ర్ 2న మా సినిమా గ్రాండ్ గా థియేట‌ర్స్ లో రిలీజ్ కాబోతుందన్నారు.

Exit mobile version