Site icon NTV Telugu

Lucky Baskhar Teaser: ఈ భాస్కర్ గాడు లక్కు తోక తొక్కాడు సార్!

Lucky Baskhar Teaser

Lucky Baskhar Teaser

Lucky Baskhar Teaser Released: వివిధ భాషల్లో, విభిన్న సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ‘మహానటి’, ‘సీతారామం’ వంటి ఘన విజయాలతో తెలుగులో కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ ను బట్టి చూస్తే ‘లక్కీ భాస్కర్’ సినిమాలో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని ఒక సరి కొత్త లుక్‌లో దుల్కర్ సల్మాన్ దర్శనం ఇచ్చాడు. ఈ సినిమా టీజర్ ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి అసాధారణ స్థాయికి ఎలా చేరుకున్నాడు అనే ఆసక్తిని రేకెత్తిస్తూ కట్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. ఒక మధ్యతరగతి వ్యక్తి, భారీ మొత్తంలో డబ్బు ఎలా సంపాదించాడు? అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ప్రశ్నలతో టీజర్ ని మలిచిన తీరు మెప్పించింది.

Jr NTR’s look in WAR 2 : వార్2 ఎన్టీఆర్ లుక్ లీక్.. కటౌట్ అదిరింది!

అలాగే టీజర్ లో దుల్కర్ సల్మాన్ పలికిన సంభాషణలు, కెమెరా పనితనం, నేపథ్య సంగీతం కట్టిపడేసేలా ఉన్నాయి. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కి జోడిగా నటిస్తోంది. ఇక ‘లక్కీ భాస్కర్’ సినిమాకి అత్యుత్తమ సాంకేతిక బృందం పని చేస్తోంది. నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి కళా దర్శకుడిగా బంగ్లాన్, ఎడిటర్ గా నవీన్ నూలి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘లక్కీ భాస్కర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version