NTV Telugu Site icon

Love Today Trailer: లవర్స్ ఒకరి ఫోన్ ఒకరు మార్చుకుంటే..?

Love

Love

Love Today Trailer: తెలుగు ప్రేక్షకులకు సినిమాలు అంటే ఉన్నంత పిచ్చి మరెవరికి ఉండదు. భాష ఏదైనా సినిమా నచ్చితే వారిని నెత్తిన పెట్టుకుంటారు. దీంతోనే ఇతర భాషల్లో హీరోలు సైతం తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఇక ఇటీవలే కోలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం లవ్ టుడే.’కోమలి’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ సరసన ఇవానా నటిస్తుండగా.. సత్యరాజ్ – రాధికా శరత్ కుమార్ – యోగిబాబు – రవీనా రవి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. రొమాంటిక్ కామెడీ డ్రామాగా కనిపిస్తోంది. కొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఇద్దరు లవర్స్.. తమ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. హీరోయిన్ ఫాదర్ వారి ప్రేమను అంగీకరించాలంటే.. ఒకరి ఫోన్ ను ఒకరు మార్చుకొని ఒక రోజు మొత్తం తమవద్ద ఉంచుకోమని చెప్తాడు. దీంతో అక్కడి నుంచి వారిద్దరికీ కష్టాలు మొదలవుతాయి. ఒకరి నిజస్వరూపం మరొకరికి తెలుస్తోంది. హీరో మందు కొడతాడని. దమ్ము కొడతాడని హీరోయిన్ కు తెలియగా.. హీరోయిన్ ఇంకో అబ్బాయితో మాట్లాడుతుందని తెలుస్తోంది. ఇక పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంట ఈ ఒక్క మార్పుతో బ్రేకప్ వరకు వెళ్తారు. అసలు హీరోయిన్ ఫాదర్ ఈ కండిషన్ ఎందుకు పెట్టాడు..? చివరికి ఈ జంట కలిశారా..? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక తమిళ్ సినిమా కాబట్టి అంతా తమిళ్ వాసనే కొడుతోంది. డబ్బింగ్ కన్నా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసి ఉంటే బావుంటుంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం ఆకట్టుకొంది. ఈ నెలలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.