DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DC OTT Release: దర్శకుడిగా స్టార్డమ్ అందుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కథానాయకుడిగా పరిచయమైన ‘డీసీ’ క్రైమ్ యాక్షన్ డ్రామా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి వామికా గబ్బి కథానాయికగా నటించారు. విడుదలకు ముందే భారీ బజ్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విషయంలోనూ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ‘డీసీ’ పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Sun NXT సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే థియేటర్లలో సినిమా ప్రదర్శన పూర్తయిన తర్వాత Sun NXT వేదికగా ‘డీసీ’ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.
ఇక సినిమా విషయానికి వస్తే, ‘డీసీ’లో లోకేష్ కనగరాజ్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దర్శకుడిగా యాక్షన్, క్రైమ్ కథలను తెరకెక్కిస్తూ తనదైన ముద్ర వేసిన ఆయన, ఇప్పుడు అదే తరహా యాక్షన్ తో హీరోగా ఎలా మెప్పిస్తారన్నది ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరోవైపు ‘రాకీ’, ‘సాని కాయిదం’, ‘కెప్టెన్ మిల్లర్’ వంటి విభిన్నమైన క్రైమ్, యాక్షన్ కథలతో గుర్తింపు తెచ్చుకున్న మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదలైన వెంటనే ‘డీసీ’కి విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ఏడాది కోలీవుడ్‌లో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా పలువురు క్రిటిక్స్ ఈ సినిమాను ప్రశంసించినట్లు సమాచారం. కథనం, యాక్షన్ ట్రీట్మెంట్, నటీనటుల ప్రదర్శనతో పాటు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వ శైలికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. దీంతో ‘డీసీ’కి థియేట్రికల్ రిలీజ్‌తో పాటు ఓటీటీ మార్కెట్లోనూ మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దర్శకుడిగా ఇప్పటికే భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ఎంతవరకు మెప్పించారన్నది ఒకవైపు ఆసక్తిని రేకెత్తిస్తుండగా, మరోవైపు సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు Sun NXT ఓటీటీ వేదిక కూడా ఖరారైంది. డిజిటల్ ఆడియన్స్ కోసం స్ట్రీమింగ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
- Tags
- cinema
- Lokesh Kanagaraj
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!