ఖైదీ సినిమాతో కోలీవుడ్ చూసిన సంచనలం లోకేష్ కనగరాజ్. ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో కూడా ఊహించని ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న లోకేష్, మూడో సినిమా విక్రమ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. నైట్ ఎఫెక్ట్ లో, రాత్రి జరిగే క్రైమ్ వరల్డ్ ని చూపిస్తూ… ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ తో, సూపర్బ్ వింటేజ్ సాంగ్స్ తో కథని చెప్పే లోకేష్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవలే లియో సినిమాతో కాస్త అప్సెట్ చేసాడు లోకేష్. దళపతి విజయ్ కి పాన్ ఇండియా హిట్ ఇస్తాడు అనుకుంటే లోకేష్, అన్ని వర్గాల ఆడియన్స్ ని కాస్త నిరాశపరిచాడు. ఈ విషయం కన్నా లోకేష్ ఇంకో విషయంలో ఆడియన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసాడు. డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి స్టార్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ ట్వీట్స్ తో విషెష్ చెప్తూ ఉన్నారు.
లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ సినిమా రజినీకాంత్ తో అఫీషియల్ గా అనౌన్స్ అయ్యి ఉంది. తలైవర్ 171 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. “కోడ్ రెడ్” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి రజినీకాంత్ బర్త్ డే రోజున కనీసం ఒక్క అనౌన్స్మెంట్ అయినా వస్తుందని తలైవర్ ఫ్యాన్స్ భావించారు. డే ఎండ్ అయ్యే వరకూ వెయిట్ చేసారు కానీ లోకేష్ నుంచి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక్క వార్త కూడా బయటకి రాలేదు. మరి న్యూ ఇయర్ కి అయినా తలైవర్ 171 గురించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. లోకేష్-రజినీ కలిసి ఒక బాషా రేంజ్ సినిమా చేస్తే చాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒక్క రికార్డ్ కూడా మిగిలే అవకాశం లేదు.
