Site icon NTV Telugu

Little Hearts: ఏదో ఒక రోజు మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా.. మీ అందరినీ గెలిచేస్తా.. ఇదే నా వార్నింగ్ జాగ్రత్త!

Little Hearts

Little Hearts

Little Hearts: తాజాగా జరిగిన లిటిల్ హార్ట్స్ సినిమా రోస్ట్ ఈవెంట్ లో భాగంగా హీరో మౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హీరో మౌళి ఈవెంట్ లో మాట్లాడుతూ.. మూవీ టీంకి, నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన ఆడియన్స్ కి, ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని అన్నాడు. అలాగే ఏ స్టేజ్ మీద పేరెంట్స్ కి ఎప్పుడు థాంక్యూ చెప్పలేదు.. ఇప్పుడు నేను చెప్పుకోవాలి, థాంక్యూ మమ్మీ.. థాంక్యూ డాడీ.. వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా నన్ను నన్ను మాత్రం కింగ్ లాగా పెంచారని తెలిపాడు. అలాగే ఈ సినిమా హిట్ అయితే తిరుపతి తప్ప ఎక్కడికి ట్రిప్ కి వెళ్ళలేని మేము, ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తా అని అన్నారు.

BJP Next President: బీజేపీ అధ్యక్ష రేసులో ఆ రాష్ట్ర సీఎం.. ఆర్ఎస్ఎస్ ఫుల్ సపోర్టు..?

అలాగే, సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ బాయికాట్ చేయండి వీడి ఫిలింని.. లేకపోతే ఇంకేదో అంటున్నారని తెలిపారు. 100 కామెంట్లు ఉంటే.. అందులో 10 కామెంట్లు నెగిటివ్ ఉంటాయి. సినిమా గురించి కూడా ఉండవు ఏవేవో ఉంటాయి. ఎందుకు పెడుతున్నారు అంటే.. నువ్వు అప్పుడు ఏదో జోక్ వేసో, ఏదో పార్టీ మీద లేకపోతే, ఈ ఆర్సిబిని ఏదో అన్నాం.. లేకపోతే ఇంకేదో ఇంకేదో వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎలాంటోళ్ళ అంటే.. మనలో ఒకడు ఎదుగుతున్నాడు అంటే.. వాళ్ళని పట్టుకొని కిందకి లాగేయాలి అసూయ ఓర్వలేక ఏదో ఒకటి అనాలి.. తెప్పిపోడ వాళ్ళ మాటలతో వీళ్ళు మన చుట్టూనే ఉంటారండి, మన చుట్టూనే చాలా మంది ఉంటారు. వీళ్ళందరికీ మనం ఇగ్నోర్ చేస్తూ పోకూడదు మాట్లాడాలి.. అడగాలి.. ఒకడు ఎదుగుతుంటే లాగేద్దాం అన్నోళ్ళకి గాని, నేనుంటే ఇష్టం లేనోళ్ళకి గాని ఒకటే చెప్తున్నా.. ఇదే నా వార్నింగ్, సెప్టెంబర్ 5న మీ అందరికీ నచ్చేస్తా.. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా.. ఏదో ఒక రోజు ఈ సినిమా.. కాకపోతే, నెక్స్ట్ సినిమా.. అది కాకపోతే నెక్స్ట్ సినిమా.. ఏదో ఒక రోజు మీరు మీ ఫ్యామిలీతో వచ్చి థియేటర్లో కూర్చొని ఈ సినిమా బాగుంది అనేలా చేస్తా.. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా… మీ అందరినీ నవ్విస్తా.. మీ అందరినీ గెలిచేస్తా.. ఇదే నా వార్నింగ్ జాగ్రత్త అంటూ మాట్లాడాడు.

LIC HFL Recruitment 2025: ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో జాబ్స్.. ఏడాదికి రూ. 19 లక్షల జీతం.. అర్హులు వీరే

అంతేకాకుడా సెప్టెంబర్ 5న లిటిల్ హర్ట్స్ మాత్రం రాకండి.. మీరు వస్తే మాత్రం నచ్చేస్తా… నా వార్నింగ్ కొంచెం స్వీట్ గా ఉండొచ్చు. కానీ, మీ అందరినీ నవ్విస్తా డెఫినెట్లీ రండి థియేటర్ కి థాంక్యూ బాయ్ అంటూ వెరైటీగా సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు.

Exit mobile version