Site icon NTV Telugu

Tollywood Heroes: మన స్టార్ హీరోల్లో ఎవరెన్ని రీమేకులు చేసారో చూడండి

Tollywood Heroes

Tollywood Heroes

ఒక భాషలో హిట్ అయిన సినిమాని ఇంకో భాషలో రీమేక్ చేయడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఉంది. ఈరోజు కొత్తగా ఏ హీరో ఇంకో హీరో సినిమాని రీమేక్ చెయ్యట్లేదు. అయితే భోళా శంకర్ ఫ్లాప్ అయినప్పటి నుంచి, ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ అయినప్పటి నుంచి రీమేక్స్ చెయ్యొద్దు అంటూ మెగా-పవన్ అభిమానులు తమ హీరోలకి సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంది. అయితే రీమేక్స్ కేవలం మెగా ఫ్యామిలీ హీరోలు మాత్రమే కాదు దాదాపు అందరు స్టార్ హీరోలు చేసారు. ఈ లిస్టులో అందరికన్నా ముందుగా చెప్పుకోవాల్సింది అన్నగారు ఎన్టీఆర్ గురించి. వెండితెర ఇలవేల్పుగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ 50 సినిమాలకి రీమేక్ చేసారు. ఎన్టీఆర్ తర్వాత అన్ని రీమేక్స్ చేసింది ఏఎన్నార్, ఈ అక్కినేని దసరా బుల్లోడు కెరీర్ మొత్తంలో 42 సినిమాలని రీమేక్ చేసాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు 42, విక్టరీ వెంకటేష్ 25, మెగాస్టార్ చిరంజీవి 17, నటసింహం బాలయ్య 12, కింగ్ నాగార్జున 12, సూపర్ స్టార్ కృష్ణ 11, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 11… ఆ తర్వాత అత్యధిక రీమేక్స్ చేసిన వారి లిస్టులో ఉన్నారు.

యంగ్ హీరోల్లో ఎన్టీఆర్ ఒక సినిమాని(నరసింహుడు) రీమేక్ చేసాడు, రామ్ చరణ్ ఒకటి(ధృవ), ప్రభాస్ రెండు(బిల్లా, యోగి) రీమేక్స్ చేసారు. అసలు రీమేక్ సినిమాలని టచ్ చేయకుండా స్టార్ కెరీర్ ని ముందుకి తీసుకోని వెళ్తున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు ఉన్నారు. ఈ ఇద్దరూ ఇప్పటివరకూ ఏ సినిమాని రీమేక్ చేయలేదు. రీమేక్ అనేది చెడ్డ విషయం కాదు కానీ ఓటీటీలు ఎక్కువ అయిన తర్వాత ఒక సినిమా బాగుంది అంటే చాలు భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్ ని వేసుకోని మరీ చూసేస్తున్నారు. ఆ తర్వాత రీమేక్ చేసినా ఉపయోగం ఉండకుండా పోతుంది. ఈ విషయం అర్ధం చేసుకోని మేకర్స్, హీరోలు, దర్శకులు రీమేక్స్ ని తగ్గిస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చే ఉండే క్యూరియాసిటీని బ్రతికించినవారు అవుతారు.

Exit mobile version