Site icon NTV Telugu

ఈ వారం ఓటిటిలో ఇంట్రెస్టింగ్ సినిమాలు

OTT Movies

OTT Movies

ఈ వారం ఓటిటిలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు టాప్ ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రీమియర్ కాబోతున్నాయి. నవంబర్ 4న దీపావళి ఉండగా, ఈ వారంలో విడుదల కానున్న సినిమాలు ఓటిటి ప్రియులకు మంచి ట్రీట్ కానున్నాయి. మరి ఈ వారం ఏఏ సినిమాలు ఓటిటిలో విడుదల కానున్నాయి తెలుసుకుందాం.

జై భీమ్
ఈ ఇంటెన్సివ్ డ్రామాలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్‌ కానుంది ‘జై భీమ్’. సామాజిక సందేశంతో రూపొందిన ఈ సినిమాలో సూర్య న్యాయవాదిగా నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. ఇంకా సినిమా గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

Read Also : నాగశౌర్య ఫామ్ హౌస్ కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు

శ్రీదేవి సోడా సెంటర్
యంగ్ హీరో సుధీర్ బాబు, హీరోయిన్ ఆనంది జంటగా నటించిన రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలై ఒక మోస్తరు రివ్యూలను అందుకుంది. “శ్రీదేవి సోడా సెంటర్” కథాంశం కొత్తగా ఉండడంతో ఈ సినిమాను ఓటిటిలో వీక్షించొచ్చు. ఈ చిత్రం నవంబర్ 4న ZEE5లో ప్రీమియర్ అవుతుంది.

గల్లీ రౌడీ
సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ డ్రామా ఈ నెల 4 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ చిత్రం థియేటర్లలో కొన్ని రోజుల క్రితం విడుదలై పేలవమైన సమీక్షలను అందుకుంది. ఇక “ఎంజీఆర్ మగన్” తమిళ భాషా గ్రామీణ డ్రామా కూడా అదే రోజు విడుదల కానుంది. శశికుమార్, సత్యరాజ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 4వ తేదీన డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతుంది ఈ చిత్రం.

నవంబర్ 5 న నెట్‌ఫ్లిక్స్ లో “మీనాక్షి సుందరేశ్వర్”, “ది వెడ్డింగ్ గెస్ట్” విడుదల కానున్నాయి.

Exit mobile version