Site icon NTV Telugu

Merlapaka Gandhi: సంతోష్ శోభన్ కోసం టీజర్ ను ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ చేసిన నితిన్!

Lss

Lss

Merlapaka Gandhi:దర్శకుడు మేర్లపాక గాంధీ తాజా చిత్రం ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’. యంగ్ హీరో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా ఈ మూవీని వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ టీజర్‌ ను హీరో నితిన్ లాంచ్ చేశారు. సంతోష్ శోభన్ తన స్నేహితుడైన కెమెరామెన్ నెల్లూరు సుదర్శన్‌తో కలిసి అందమైన ప్రదేశాలకు ప్రయాణించి ట్రావెల్ బ్లాగర్‌ గా మారాలనుకుంటున్నాడు. సంతోష్ ప్రయాణంలో అందమైన అమ్మాయి ఫరియా అబ్దుల్లాను కలుస్తాడు. ఆమెను ఫ్లర్ట్ చేయాలని ప్రయత్నిస్తాడు.

హిలేరియస్ గా సాగుతున్న టీజర్ సెకండాఫ్‌లో సినిమా క్రైమ్ పార్ట్ చూపించడం క్యురియాసిటీని పెంచింది. దర్శకుడు మేర్లపాక గాంధీ రొమాన్స్ తో పాటు క్రైమ్, కామెడీ అంశాలను మిక్స్ చేసి ఈ కథను ఆసక్తిగా మలిచినట్టు టీజర్ చూస్తుంటే అర్థమౌతోంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుందని మేకర్స్ ట్రైలర్‌ ద్వారా తెలియజేశారు.

Exit mobile version