Site icon NTV Telugu

Liger Trailer Release : ‘లైగర్’ థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడంటే….

Liger Trailer Release

Liger Trailer Release

Liger’  Trailer Release :

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతోంది ‘లైగర్’ మూవీ. ఆగస్ట్ 25న ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని దూకుడుగా చేస్తోంది. ‘లైగర్’ నుండి విడుదలైన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్ ఆశ్చర్యానికి గురిచేస్తే, ఫస్ట్ సింగల్ ‘అక్డీ పక్డీ’ డ్యాన్స్ నంబర్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఈ పాట ఇప్పటివరకు 30 మిలియన్ ప్లస్ వ్యూస్ తో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో వుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 21న అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చుట్టూ ఫైటర్‌లు వుండగా విజయ్ మధ్యలో వుండి ఫైట్ కి సిద్ధమవ్వడం గమనించవచ్చు.

‘లైగర్’ యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండను ఎంఎంఎ ఫైటర్‌గా ప్రజంట్ చేసి థ్రిల్లర్ రైడ్‌ ని ప్రామిస్ చేసింది చిత్ర యూనిట్. ఫస్ట్ గ్లింప్స్ లో విజయ్ పై మాత్రమే దృష్టి పెట్టారు. మరో ఐదు రోజుల్లో విడుదల కానున్న ట్రైలర్ లో మైక్ టైసన్‌తో సహా ఇతర నటీనటులు, సినిమా కంటెంట్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version