Site icon NTV Telugu

Liger: బాలీవుడ్ బ్యూటీ తో విజయ్ దేవరకొండ ఊర మాస్ డాన్స్..

Liger

Liger

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్ల పై కరణ్ జోహార్, ఛార్మీ, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా .. బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అతిధి పాత్రలో మెరవనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసిన విషయం విదితమే. జూలై 11 న ‘అకడి పకడి’ అంటూ సాగే మాస్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఇక తాజాగా ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ప్రోమోను బట్టి ఇది పార్టీ సాంగ్ లా కనిపిస్తోంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ మాస్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవ్వడంతో పాటు థియేటర్ లో స్క్రీన్స్ చిరిగిపోవడం ఖాయమనిపిస్తోంది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో విజయ్ మొట్టమొదటిసారి ఊర మాస్ స్టెప్పులు వేసి ఆకట్టుకున్నాడు. ఇక అనన్య ఘాటు అందాలు ప్రత్యేక ఆకర్షణ గా నిలవనున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రౌడీ హీరో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

Exit mobile version