విజయ్ దేవరకొండ తన రాబోయే స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’ కోసం చాలా కష్టపడుతున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉంది. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోవడంలో బిజీగా ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ దాదాపు ముగింపుకు చేరుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ని పూర్తి చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. సెట్‌లోని ఫోటోతో సోషల్ మీడియాలో అప్‌డేట్‌ను పంచుకున్నారు చిత్ర నిర్మాతలలో ఒకరైన ఛార్మి.
Read Also : ‘లైగర్’ అప్డేట్… పిక్ షేర్ చేసిన ఛార్మి
అయితే మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండడంతో సినిమాను ఇప్పుడు హైదరాబాద్‌కు తరలించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. సినిమాలో ఎక్కువ భాగం ముంబైలో చిత్రీకరించిన విషయం తెలిసిందే. మిగిలిన చిత్రాన్ని మాత్రం ‘లైగర్’ టీం ఇక్కడే పూర్తి చేస్తుందని తాజా సమాచారం. కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ చిత్రంలో అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ‘లైగర్’ ఆగష్టు 25న పలు భాషల్లో విడుదల కానుంది.
