NTV Telugu Site icon

Liger: తల్లి కొడుకుల మధ్యలో డ్రామా క్వీన్.. పూరి మార్క్ రొమాన్స్

Liger

Liger

Liger: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజ్ కు ముహూర్తం కాహారారు చేశారు మేకర్స్. ‘ఆఫట్’ అనే రొమాంటిక్ సాంగ్ ను ఆగస్టు 5 న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ ఒక వీడియో టీజర్ ను వదిలారు.

పూరి మార్క్ రొమాన్స్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ సాంగ్ లో విజయ్, అనన్య ల రొమాన్స్ పీక్స్ లో ఉంటుందని తెలిసిపోతోంది. ఇక టీజర్ లో విజయ్ ఇంటికి వచ్చిన అనన్య.. అతడిని రమ్మని పిలుస్తుంటే.. విజయ్, తల్లి రమ్య కృష్ణకు భయపడి రాకపోవడం.. చివరికి విజయ్ ను ఎలాగైనా బయటికి తీసుకొచ్చి అతగాడి పెదాలను పట్టుకొని అనన్య లాగడం చూస్తుంటే ఈ సాంగ్ చార్ట్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయేలా కనిపిస్తోంది. ఇక ఈ టీజర్ ను విజయ్ దేవరకొండ షేర్ చేస్తూ “తల్లి కొడుకుల మధ్య వచ్చే డ్రామా క్వీన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది” అంటూ రాసుకొచ్చాడు. ఇక పెదవి ముద్దుల్లో విజయ్ బ్రాండ్ అంబాసిడర్.. రొమాంటిక్ సాంగ్స్ తెరకెక్కించడంలో పూరి జగన్నాథ్ సిద్ధహస్తుడు. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చే రొమాంటిక్ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకోరోజు ఆగాల్సిందే.