Liger: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. పాన్ ఇండియా సినిమాగా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులను భారీ అంచనాలను పెట్టుకొన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రేపే సినిమా విడుదల కాబోతుండడంతో ఇప్పటినుంచి రౌడీ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద సందడి చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దుబాయ్ లో ఉన్న ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు లైగర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు.
ట్విట్టర్ వేదికగా సినిమాను ప్రశంసలతో ముంచెత్తాడు. “లైగర్.. సీటిమార్ మాస్ ఎంటర్ టైనర్.. విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో. మొత్తం సినిమాను అతని భుజస్కంధాలపై మోశాడు. డైరెక్షన్, యాక్షన్ సీన్స్ టెర్రిఫిక్ గా ఉన్నాయి. రమ్య కృష్ణ ఒక సర్ ప్రైజింగ్ ప్యాకేజ్. స్క్రీన్ ప్లే, స్టోరీ యావరేజ్ గా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సినిమా మంచి పాజిటివ్ టాక్ తో నడిచేలా ఉందని, ఇదే పాజిటివ్ టాక్ కంటిన్యూ చేస్తే లైగర్ హిట్ టాక్ అందుకోవడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. మరి రేపు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
#Liger is Citii Maar Mass Entertainer. #VijayDeverakonda is One Man Show. He Stole the Show all the way. Terrific Action Stunts & Direction. #RamyaKrishnan is Surprise Package. Story & Screenplay is Average.
⭐⭐⭐
— Umair Sandhu (@UmairSandu) August 23, 2022