NTV Telugu Site icon

Leo: ‘లియో’కి వందల కోట్ల బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలంటే?

Leo

Leo

Leo Theatrical and Non -Theatrical business details: దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో చాలా స్టార్ క్యాస్ట్ నటించింది. విజయ్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ తదితరులు ఇతర కీలక పాత్రలో నటితున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా , ఎన్. సతీస్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

Tiger Nageswara Rao : రేపు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లు గా రాబోయేది ఎవరంటే…?

అక్టోబర్ 19న లియో విడుదలకు ప్లాన్ చేస్తున్న క్రమంలో సినిమా బిజినెస్ ఏమేరకు జరిగింది అనేది పరిశీలిద్దాం. తలపతి విజయ్-లోకేష్ కనగరాజ్‌ల రాబోయే చిత్రం లియోలో అద్భుతమైన థియేట్రికల్ అలాగే నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగింది. లియో థియేట్రికల్ బిజినెస్ ఈమేరకు ఉంది. తమిళనాడు – 100 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ – 14 కోట్లు, తెలంగాణ- 7 కోట్లు, కర్నాటక – 13 కోట్లు, కేరళ – 16 కోట్లు, మిగతా భారతదేశంలో – 8 కోట్లు, ఓవర్సీస్ – 60 కోట్లు మొత్తం ప్రపంచవ్యాప్త థియేట్రికల్ బిజినెస్ 218 కోట్లుగా ఉంది. 218 కోట్లు అనేది హీరో విజయ్‌కి ఆల్-టైమ్ రికార్డ్ బిజినెస్. మొత్తంగా పరిశీలిస్తే, అది 2 పాయింట్ 0 తర్వాత కోలీవుడ్‌లోని ఆల్-టైమ్ టాప్ 2 బిజినెస్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఇక లియో నాన్ – థియేట్రికల్ బిజినెస్ : సంగీతం – 16 కోట్లు, శాటిలైట్ – 80 కోట్లు, డిజిటల్ – 140 కోట్లు, మొత్తం నాన్-థియేట్రికల్ బిజినెస్ : 236 కోట్లు అలా మొత్తం బిజినెస్ : 454 కోట్లుగా నిలిచింది.