NTV Telugu Site icon

Leo OTT Release: ‘లియో‘ డిజిటల్ రిలీజ్ ఆ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Leo

Leo

Leo OTT Release in Netflix:తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తాజాగా ‘లియో‘ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చారు. సక్సెస్ ఫుల్ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించగా పూర్తి స్థాయి యాక్షన్ మూవీగా ‘లియో‘ రూపొందించారు. ఈ ‘లియో’ సినిమాను సెవెన్ స్కీన్స్ బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి నిర్మించారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా ఆమెతో పాటు హీరోయిన్ ప్రియా ఆనంద్, మడొన్నా సెబాస్టియన్ కీలక పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముఖ్యమైన పాత్రలో కనిపించగా యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్స్ రైట్స్ గురించి కొన్ని కీలక విషయాలు బయటకి వచ్చాయి.

Bramayugam: మమ్ముట్టి ‘భ్రమ యుగం’ అప్పుడే అవగొట్టారు!

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దక్కించుకోగా ఈ విషయాన్ని ‘లియో‘ టైటిల్ కార్డులలో వెల్లడించారు. ఈ డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ నిర్మాణ సంస్థకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచే అనే విషయం పరిశీలిస్తే ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి రానున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో రిలీజ్ అవగా నవంబర్ 3వ వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. మరోవైపు ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ ను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమిని కొనుగోలు చేయగా ఈ సినిమా కోసం సదరు చానల్ పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించినట్లు చెబుతున్నారు.

Show comments