Site icon NTV Telugu

Leo: హైదరాబాదులో లియో ఈవెంట్.. విజయ్ వస్తాడా?

Vijay Leo

Vijay Leo

Leo Movie Event to be Held at Hyderabad: దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర తెలుగు హక్కుల్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్న క్రమంలో లియో విడుదలకు సంబంధించి తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 19న ఉదయం 7 గంటల షోలతో లియో విడుదలవుతుందని, దసరా సెలవుల్లో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నానని నాగవంశీ చెప్పుకొచ్చారు. తెలుగులో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చిందని, తెలుగులో లియో టైటిల్ ని ఒకరు రిజిస్టర్ చేసుకున్నారని అయితే వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించారని అన్నారు. ఈ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసిందన్న ఆయన ఆ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నవారితో మాట్లాడుతున్నాం, సమస్య పరిష్కారం అవుతుంది, విడుదలకు ఎలాంటి మార్పు ఉండదు, అక్టోబర్ 19నే తెలుగులో కూడా లియో విడుదల అవుతుందని అన్నారు.

Allu Arjun: బ్రేకింగ్.. నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ

లియో తెలుగు టైటిల్ ని కూడా తమిళ నిర్మాతలే రిజిస్టర్ చేయించారని, పైగా ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది కాబట్టి విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదన్నారు. ఇక్కడ తెలుగులో లియో టైటిల్ ని వేరొకరు కూడా రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి కానీ, మాకు గానీ ఎటువంటి నష్టం జరగకుండా సమస్య పరిష్కరించుకుంటామని నాగవంశీ అన్నారు. ఈ సినిమా బాగుంటుంది అనే నమ్మకంతోనే తెలుగు హక్కులు తీసుకోవడం జరిగిందని, దర్శకుడు లోకేష్ నిరాశపరచరు అని అనుకుంటున్నానని అన్నారు. అసలు పండక్కి థియేటర్ల సమస్య లేదు, ఏ సినిమాకి తగ్గట్టుగా ఆ సినిమా విడుదలవుతుంది లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు ఎటువంటి సమస్య లేకుండా ఏ సినిమాకి కావాల్సినన్ని థియేటర్లు ఆ సినిమాకి కేటాయించారని అన్నారు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని, భగవంత్ కేసరి ఘన విజయం సాధించాలని, అంతకంటే పెద్ద హిట్ సినిమా బాలకృష్ణ గారితో మేము తీయాలని కోరుకుంటున్నానని అన్నారు. మేము నిర్మించిన వాతి(సార్) చిత్రాన్ని తమిళ్ లో లలిత్ కుమార్ గారు విడుదల చేశారు, ఆ సమయంలో ఏర్పడిన అనుబంధంతో ఇప్పుడు తెలుగులో మేము లియో చిత్రాన్ని విడుదల చేస్తున్నామని అన్నారు. ఈ ఆదివారం లోపు హైదరాబాద్ లో లియో వేడుక నిర్వహించాలి అనుకుంటున్నాం లోకేష్ కనగరాజ్ గారు, అనిరుధ్ గారు, త్రిష గారు వస్తారని కానీ విజయ్ గారి గురించి క్లారిటీ లేదని అన్నారు.

Exit mobile version