NTV Telugu Site icon

Leo Scam: కలెక్షన్స్ లో నిజం లేదా? బుకింగ్స్ అన్నీ ట్రాషా?

Leo

Leo

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా లియో. మాస్టర్ తర్వాత హిట్ కోసం విజయ్-లోకేష్ చేసిన లియో సినిమా ట్రెమండస్ కలెక్షన్స్ ని రాబడుతుంది. కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ సినిమాల రికార్డులని కూడా బ్రేక్ చేస్తూ లియో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. జైలర్, పొన్నియిన్ సెల్వన్ సినిమాల రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ లియో వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతోంది. మొదటి రోజు లియో సినిమా వరల్డ్ వైడ్ గా 148 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఇక్కడి నుంచి లియో సినిమా కలెక్షన్స్ పై నెగటివ్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. 4000 థియేటర్స్ తో 148 కోట్లు ఎలా వచ్చాయి? KGF 2, RRR లాంటి సినిమాలు 15000 నుంచి 20000 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యాయి. అన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి కాబట్టే కలెక్షన్స్ కూడా వందల కోట్లలో ఉన్నాయి.

ఆ రేంజ్ థియేటర్స్ లేకుండా కేవలం 4000 థియేటర్స్ తోనే లియో సినిమా 148 కోట్లు ఎలా కలెక్ట్ చేసింది… ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో ప్రాక్సీ జరుగుతోంది అంటూ సోషల్ మీడియాలో యాంటీ విజయ్ ఫ్యాన్స్ అంతా హంగామా చేస్తున్నారు. #LeoScam #LeoDisaster అనే ట్యాగ్స్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ విషయం పక్కన పెడితే… ఒక హీరో సినిమా కలెక్షన్స్ ఎక్కువగా వస్తున్నప్పుడు ఇతర హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఫేక్ అనే కామెంట్స్ చేయడం మాములే. లియో సినిమా విషయంలో జరుగుతున్నది కూడా ఇదే. నిజానికి లియో సినిమాపై రిలీజ్ కి ముందే భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్-లోకేష్ కాంబినేషన్, LCU ఇంపాక్ట్ కలిసి లియో సినిమా బుకింగ్స్ ని భారీగా పెంచింది. ఈ కారణంగానే లియో ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. అయితే టాక్ బాగోలేదు కాబట్టి లాంగ్ రన్ లో లియో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది? ఎక్కడి వరకూ వచ్చి ఆగుతుంది అనేది చూడాలి.