Site icon NTV Telugu

Leo: జైలర్, జవాన్ బుకింగ్స్ ని దాటేసింది…

Leo

Leo

2023 బిగ్గెస్ట్ హిట్స్ కేటగిరిలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్, షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు టాప్ ప్లేస్ లో ఉంటాయి. ఈ సినిమాలు రిలీజ్ అయిన సమయంలో థియేటర్స్ లో రచ్చ జరిగింది. జవాన్, పఠాన్, జైలర్ సినిమాలు కలిపి బాక్సాఫీస్ దగ్గర 2800 కోట్ల వరకూ రాబట్టాయి అంటే కలెక్షన్స్ ఏ రేంజులో వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా జవాన్, జైలర్ సినిమాల బుకింగ్స్ ని బ్రేక్ చేస్తూ లియో సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ లో లియో సినిమా యుఎస్ అండ్ యూకే సెంటర్స్ లో లియో సినిమా స్ట్రాంగ్ బుకింగ్స్ ని రాబడుతుంది. 1 మిలియన్ ప్రీమియర్స్ ని అచీవ్ చేసేలా ఉన్న లియో సినిమా ఇప్పుడు 2023 టాప్ ప్రీబుకింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.

దళపతి విజయ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బుకింగ్స్ రాబట్టిన సినిమాగా లియో నిలవనుంది. నిజానికి ఓవర్సీస్ లో విజయ్ హాల్ఫ్ మిలియన్ ప్రీమియర్స్ కూడా లేవు. అలాంటిది వన్ మిలియన్ మార్క్ ప్రీమియర్స్ రేంజులో బుకింగ్స్ అంటే అది పూర్తిగా లోకేష్ కనగరాజ్ మార్క్ అనే చెప్పాలి. ఖైదీ సినిమా, విక్రమ్ సినిమాలు లోకేష్ కనగరాజ్ కి సాలిడ్ మార్కెట్ తెచ్చాయి. అందుకే లియో లోకేష్ సినిమాగానే బుకింగ్స్ ని రాబడుతుంది, లోకేష్ సినిమాగానే జనాల్లోకి వెళ్లింది. ప్రీబుకింగ్స్ విషయంలో లోకేష్ మార్కెట్ విజయ్ కి హెల్ప్ అయ్యి లియో బుకింగ్స్ లో కనిపిస్తుంది. మరి ఫుల్ లెంగ్త్ కలెక్షన్స్ కూడా జైలర్, పఠాన్, జవాన్ సినిమా స్థాయిలో ఉంటాయా? లేక 300 నుంచి 500 కోట్ల వరకే పరిమితం అవుతుందా అనేది చూడాలి. నార్త్ లో మల్టీప్లెక్స్ రిలీజ్ లేకపోవడం, తెలుగు-కన్నడలో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉండడం లియో కలెక్షన్స్ లో దెబ్బ వేసే అవకాశం ఉంది.

Exit mobile version